గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ అత్యున్నత పురస్కారానికి పలు రంగాల్లో సేవలందించిన ప్రముఖులను ఎంపిక చేశారు. ఈ ఏడాది మొత్తం 106 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. వీరిలో ఆరుగురు పద్మవిభూషణ్, తొమ్మిది మంది పద్మభూషణ్, 91 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12 మంది పద్మ అవార్డులు అందుకున్నారు.
ఏపీ నుంచి ఏడుగురు, తెలంగాణ నుంచి ఐదుగురు పద్మ అవార్డులు అందుకున్నారు.
తెలంగాణ పద్మాలు ఎవరంటే ..
పద్మభూషణ్ గ్రహీతలు
1. చిన్నజీయర్ స్వామి – ఆధ్యాత్మిక
2. కమలేష్ డి పటేల్ – ఆధ్మాత్మిక
పద్మశ్రీ గ్రహీతలు..
1. మోదడుగు విజయ్ గుప్తా – సైన్స్ రంగం
2. పసుపులేటి హనుమంతరావు – వైద్య రంగం
3. బీ.రామకృష్ణా రెడ్డి – విద్యా సాహిత్యం.