
Surya Son of Krishnan Movie | Nidare Kala Ayinadi Video Song

నిదరే కల అయినదీ, కలయే నిజమైనది!
బతుకే జత అయినదీ, జతయే అతనన్నది
మనసేమో ఆగదూ, క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా!… నిదరే కల అయినదీ
చరణం 1:
వయసంతా వసంత గాలి – మనసనుకో, మమతనుకో
ఎదురైనది ఎడారిదారి – చిగురులతో, చిలకలతో
యమునకు కే సంగమమే – కడలినది, కలవదులే
హృదయమిలా అంకితమై – నిలిచినది, తనకొరకే
పడినముది, పడుచోడి – ఎదలో చిరుమువ్వల సవ్వడి! నిదరే కల అయినదీ
చరణం 2:
అభిమానం అనేది మౌనం – పెదవులపై పలకదులే
అనురాగం అనే స్వరాగం – స్వరములకే దొరకదులే!
నిన్ను కలిసిన ఈ క్షణమే – చిగురించే మధు మురళి
నిను తగిలిన ఈ తనువే – పులకరించే ఎద రగిలే
యెదుటపడి కుదుటపడే – మమకారపు నివాళిలే ఇది! నిదరే కల అయినదీ