వేసవిలో వచ్చే పండ్లు అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి పుచ్చకాయ, తర్భూజ. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయి.
ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయలో ఎర్రగా ఉండే లైకోఫిన్ అనే గుజ్జు వేసవిలో చర్మంలోని సహజ కణజాలం దెబ్బతినకుండా రక్షిస్తుంది
ద్రాక్ష తింటే దాహం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది రక్తశుద్ధి చేయడంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది. ద్రాక్ష జ్యూస్ కూడా ఎంతో మంచిది.
పైనాపిల్ నీటి శాతంతో పాటు పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో జీర్ణశక్తిని వృద్ది చేస్తుంది. వీటిలోని విటమిన్ల కలయిక శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా చేస్తాయి. రుచిగా కూడా ఉంటుంది.
నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. శరీరంలోని వేడి తగ్గించేందుకు నిమ్మరసంలో ఉప్పు, చక్కెర కలిపి తీసుకుంటే దాహం తీరడంతో పాటు శక్తి లభిస్తుంది.
ప్రకృతి అందించిన ఫలాల్లో రారాజు మామిడి. వేసవి ప్రారం భంలోనే మామిడి కాయలు వస్తాయి. మామిడి ఫలాలలో ఐరన్, ప్రొటీన్స్, ఎ,సి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. కేన్సర్ను నివారించే బీటా కెరోటిన్ కూడా మామిడిలో ఎక్కువ.
కమలాఫలంలో పొటాషియంతో పాటు పోషకాలు మెండు ఎండాకాలం అంటేనే రోజు రోజుకు పెరిగే ఉష్ణోగ్రతలు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ భయపడేలా చేస్తాయి. ఈ కాలంలో ఎక్కువగా పండ్లు తీసుకుంటే కొంత ఉపశమనం పొందవచ్చని
నిపుణులు చెపుతుంటారు.
శరంలో తగ్గే గ్లూకోజ్ శాతాన్ని పెంచేందుకు పండ్లు ఉపకరిస్తాయని వైద్యులు చెపుతారు.
తప్పనిసరిగా పండ్లు తింటే వేసవి తాపాన్ని, తట్టుకోవచ్చని కూడా చెపుతారు. అందుకే క్రమం తప్పకుండా పండ్లు తింటే మంచిది.
రోజూ సుమారు ఆరు లీటర్ల మంచినీరు తాగాలి. ఇలా చేస్తే ఎలాంటి వ్యాధులురావు. వేసవిలో ప్రతి ఒక్కరు తప్పని సరిగా జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు
వేసవి కాలంలో లభించే కర్భూజాలో శరీరానికి అవసరమైన నీటితో పాటు పోషకాలు లభిస్తాయి పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. వేసవిలో వచ్చే పుచ్చకాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఈ పండ్లలో కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇక కొబ్బరిబొండంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి ఈ కాలంలో డీ హైడ్రేషన్ సుంచి కాపాడుకునేందుకు కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. తక్కువ మోతాదులో కార్బొహైడ్రేట్లు కూడా లభిస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయి. రోగనిరోధకశక్తి పెంచుతుంది. డీ హైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తలకు రక్షణతో పాటు కళ్లజోడు పెట్టుకోవాలి. గొడుగులు కూడా తప్పనిసరిగా ఉయోగించాలి. అల్ట్రావైలెట్ కిరణాలు శరీరంపై పడినప్పుడు సన్ బర్న్, స్కిన్ ఇన్ ఫెక్షన్ రాకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి ఎండలో తిరుగుతున్నప్పుడు కళ్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
విశ్రాంతి కోసం రోజ్ వాటర్ వేయడం, కళ్లపై కీర దోసకాయ ముక్కలు పెట్టుకోవాలి. వేసవికి కాటన్ దుస్తులు ధరించడం మేలు.
ఎండలో నుండి ఇంటికి రాగానే పండ్ల రసాలు తీసుకోవడం వల్ల కొంతవరకు ఎండ నుంచి వచ్చే వేడి, వడదెబ్బను నివారించవచ్చు.
పైనాపిల్, ద్రాక్ష, రసాలతో పాటు క్యారెట్ జ్యూస్ కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఎండలో తిరిగి అనారోగ్యానికి గురయితే శరీరంపై ఐస్ ముక్కలు లేదా తడిగుడ్డ ఉంచడం పల్ల ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చు. గ్లూకోస్, ఎలక్ట్రాల్ పౌడర్, కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. అలాగే చల్లని గాలి తగిలేలా పడుకోవాలి.