Home Health శరీరం విపరీతంగా లావెక్కుతోందా ! ఇవి పాటించండి

శరీరం విపరీతంగా లావెక్కుతోందా ! ఇవి పాటించండి

శరీరం విపరీతంగా లావెక్కుతోందా ! ఇవి పాటించండి
How to control weight 2021

నేడు స్త్రీలకి పనులు తక్కువై శరీరం విపరీతంగా లావెక్కుతోంది. ముఖ్యంగా 20 ఏళ్ల యువకులు, వధువల కోసం వెతికే పెళ్లికాని ప్రసాదులకు పాపం లావిష్టిగా ఉన్న అమ్మాయిలే ఎక్కువగా తగలటంతో పెళ్లి కాకుండా ఉండిపోతున్నారని ఒక సర్వేలో తేలింది.

ఆడపిల్లల చేత ఇంటిపనులు చేయించటం ముఖ్యం. హై.బి.పి షుగర్ హార్ట్ ఎటాక్ రాకుండా వాకింగ్ కూడా చేస్తుండాలి. గుడికెళ్లటంతో భక్తిముక్తి కూడా లభిస్తుంది. ఇంట్లో చీపురు పట్టి ఊడ్చి ముగ్గువేసే ఆడపిల్ల నేడు కనపడటం లేదు పనిమనిషి ఉందనే నిర్లక్ష్యం ఎక్కువైంది. శారీరక శ్రమంటే బరువులు మోయక్కర్లేదు, మెట్లు ఎక్కి దిగండి. బట్టలు జాడిం చండీ వాషింగ్ మిషన్ ఉంది అనుకుంటే, మీ అపార్ట్మెంట్ పై నించి కిందకి కనీసం 3 ఫ్లోర్స్ ఎక్కి దిగండి చాలు పదిసార్లు అలసిపోయే దాకా.

వంటిల్లే వ్యాయామశాల భుజాల నొప్పికి, మిక్సీ వాడకుండా చక్కగా బండరోలు వాడండి. మణికట్టు, చేతి వ్రేళ్లకు మంచి వ్యాయామం. పిండి తడిపి బాగా మెత్తగా పిసకటం, వత్తటం కాల్చటం వల్ల చేతులకి వ్యాయామం అవుతుంది. అంట్లు తోమటం, బాత్రూం టైల్స్ శుభ్రం చేయటం, టబ్స్ పాచిని వదలగొట్టడం గార్డేనింగ్, మొక్కల కొమ్మలు కత్తిరించటం, నీరుపోయటం వల్ల చేతి కండరాలు గట్టిపడతాయి. స్వయంగా షాపుకి వెళ్లి షాపింగ్ చేయటం వల్ల మానసికంగా రిలాక్స్ అవుతారు.

నా పని నేను చేయాలి అనే గాంధీజీ మాటల్లో ఎంతో సత్యం, ఆరోగ్యం ఇమిడి ఉన్నాయి. పనిమనిషిని మానిపించి, ఆడ మగ, పిల్ల పెద్ద ఎవరైనా సరే వారి కప్పు, గ్లాసు, కంచం తోమి కడగడం ఎవరి బట్టలు వారు ఉతికి ఆరేయడం మొదలుపెడితే రోగాలు మటు మాయం అవుతాయి సుమా! అలాగే చిన్నా చితకా ఆరోగ్యంగా ఉండాలంటే కుర్చీకి రెస్టు ఇవ్వాలి. మమ్మల్ని నేలమీద కూలబడమంటారా అని కాదు. అలా కుర్చీకి అతుక్కుపోతే, లాంగ్ సిట్టర్ అయితే హార్టు, షుగర్ పేషెంట్స్ అవటం ఖాయం. డెస్క్ జాబ్ చేసే వారి సిట్టింగ్ అవర్స్ చూడండి. నిద్రకి ఎనిమిది గంటలు వదిలేస్తే మిగతా 90శాతం అలా కూచుని టి.వి.తో, ఆఫీసు పనితో గడిపేస్తారు ఇలా కూచోటంతో మెటబాలిక్, కార్డియో వాస్క్యులర్ సిస్టంకి నష్టం కలుగుతుంది.

దీనితో హైపర్ టెన్షన్, కార్డియో వాస్కులర్ డిసీజ్, ఒబెసిటీ, టైప్-2 షుగర్, కేన్సర్ వచ్చే ఛాన్సు ఎక్కువ. అమెరికన్ పరిశోధన ప్రకారం అలా కుర్చీకి అతుక్కుపోవటం త్వరగా చావుని కొనితెచ్చుకోవటమే.

పైగా హిప్, స్పైన్, షోల్డర్, నెక్ పెయిన్ కి బాధ్యులం మనమే అవుతాం. కండరాలు ఒకే పొజిషన్ కి అలవాటు పడి పూర్ బాడీ బాలెన్స్, కధలకపోవటం జరిగే ప్రమాదం ఉంది. కి- బోర్డుపై వంగి టైపింగ్ చేస్తే అలా వంగి నడవటమే అలవాటు అవుతుంది. కాళ్లను క్రాస్ చేసి కూచుంటే హిప్, లోయర్ బాడీ ప్రభావితం అవుతుంది.

మరి లాంగ్ సిట్టింగ్ కి ఎలా బ్రేక్ ఇవ్వాలి?

మొబైల్లో ప్రతి గంటకీ ఐదునిమిషాలు బ్రేక్ ఇవ్వాలి అనేలా అలారం సెట్ చేయాలి టి.వి ముందు అలా కూలబడకుండా కాసేపు అటు ఇటు నడుస్తూ కళ్లకు కూడా విశ్రాంతి ఇవ్వాలి. ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు పచ్చికూరగాయలను ఆహారంగా తీసుకోండి. ఇవి ఆకలిమితంగా ఉండటానికి జ్ఞాపకశక్తికి చక్కని శరీరాకృతికి మంచి ఛాయ రావడానికి తోడ్పడు తుంది. మధ్యాహ్న భోజనంలో అన్నం ఆకుకూరలు,పప్పు మజ్జిగ తీసుకోవాలి. భోజనానికి ముందుగా ఒక గ్లాసు నీరు త్రాగాలి. ఒక టమాట లేదా ఓ దోసకాయ మిరియాలపొడి చల్లుకు తినాలి. కాఫీ టీలు చాలా వరకు తగ్గించాలి. ఒకటి లేదా రెండు సార్లు తాగితే పరవాలేదు నిమ్మరసం వారానికి ఒకసారి తాగితే ఎంతో మంచిది. అంతే కాకుండా వర్క్ చేసేటపుడు అలాగే కుర్చీలో కాకుండా కొంచెం సేపు ఎక్సర్ సైజ్ బాల్ పై కూచుంటే మజిల్స్ యాక్టివ్ గా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here