
శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటి ముత్యాలు
కృష్ణవేణిలో అలల గీతాలు
నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షునికి పూలుగా
కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతలే పాడగా
శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
గంగను మరపించు ఈ కృష్ణవేణి
వెలుగులు ప్రవహించు తెలుగింటి రాణి
పాపాల హరియించు పావన జలము
పచ్చగ ఈ నెల పండించు ఫలము
ఈ ఏటి నీటి పాయలే తేటగీతులే పాడగా
సిరిలెన్నో పండి ఈ భువి స్వర్గలోకమై మారగా
కల్లకపటమే కానరాని ఈ పల్లెసీమలో
శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే
శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే