బాధ్యతలు తీసుకొనే వారు ప్రార్థనలకు హాజరుకాకపోవడం, ప్రార్థనలలో మునిగితేలేవారు బాధ్యతల ను తీసుకోకపోవడం చాలాసార్లు జరుగుతుంటుంది. ఆధ్యాత్మికత అనేది ఈ రెండింటిని ఒకే సమయం లో జరిగేలా చూస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు నేడు తమ కర్తవ్యాల పట్ల చూపుతున్న శ్రద్ధ, సహకార భావన, సేవాదృక్పథాలకు పైన చెప్పిన కార్యనిరతి, ప్రార్థనల సంగమమే స్ఫూర్తి.
సేవ, ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఒక దానితో ఒకటి కలిసి ఉంటాయి. నీవు ధ్యానపు లోతుల్లోనికి వెడుతున్న కొద్దీ, ఆ అను భూతిని ఇతరులతో పంచుకోవాలన్న ఆరాటం ఎక్కువవుతుంది. నీవేదైనా సేవ లేదా సహాయం చేసినప్పుడు నీకు బోలెడంత పుణ్యం,యోగ్యత లభిస్తుంది. నీవు ఇతరులకోసం ఏదైనా సహాయం చేసినప్పుడు నీకోసం కొంత పుణ్యం లభిస్తుంది.
చాలా మంది తెలివైన వ్యాపారస్తులు, ఇలా పుణ్యాన్ని పొందటం కోసమే అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. ఎవరైనా ఆనందంగా ఉన్నారంటే, ఆ వ్యక్తి ఇంతకు పూర్వం ఎప్పుడో తగినంత సేవ చేసి ఉన్నాడని భావించు. అంతేకాదు. ఇప్పుడు నీవు ఆనందంగా లేనట్ల యితే వెంటనే ఎవరో ఒకరికి సహాయం చేసి ఆ మేరకు పుణ్యాన్ని సంపాదించుకో.
ఇది నీ బ్యాంకు ఖాతాలో డబ్బును జమచేసుకోవ డం వంటిది. నిన్ను నీవు ఇతరులకు అర్పించుకుంటున్న కొద్దీ నీకు మరింత బలం లభిస్తూ ఉంటుంది.మన మనసు విశాలమై, మరింత మందికి చేరువైనకొద్దీ, మనలో దైవభావన నిండేందుకు మరింత స్థలం లభిస్తుంది.
ప్రపంచానికి సేవ చేయడమే మన మొట్టమొదటి, ప్రధాన కర్తవ్యం కావాలి. సేవ ఒక్కటే జీవిత లక్ష్యమైనప్పుడు మన లో భయాలు తొలగి పోతాయి. బుద్ధి కేంద్రీకృతమవుతుంది. చేసే ప్రతీ పని ఉపయోగక రమవుతుంది. దీర్ఘకాలం నిలిచే అనందం కలుగుతుంది.
మనం చేసే సేవ వలన సహజత్వం, మానవీయ విలువలు సమాజం లో పెంపొందుతాయి. తద్వారా భయం, నిరాశానిస్పృహలు లేని సమాజ నిర్మాణంలో మన సేవ సహాయకారి కాగలదు. నీలో ఇతరులకు సహాయపడాలనే కోర్కె కలిగినప్పుడు నీ స్వంత జీవితం గురించి
చింతించనక్కరలేదు. దైవానికి నీ జీవితం పెద్ద సమస్యేమీకాదు. దైవశక్తి నిన్ను రక్షించగలదు. ధన సంపాదన గురించి పెద్దగా ఆందోళన చెంది, ఆలోచించవద్దు. ప్రేమభావంతో నిండిపో, కృతజ్ఞభావంలో నిండిపో, ఆ ప్రేమభావనతో నీ భయాలన్నీ తొలగించుకో.
సేవ అనేది ఎప్పుడూ అంతులేని ఉత్సాహాన్ని ఇస్తుంది. నైరాశ్యా న్ని పోగొట్టుకోడానికి ఇది అత్యుత్తమమైన మార్గం. నీకు అత్యంత నిరాశాజనకంగా,భయంకరంగా, చెడ్డగా అనిపించిన రోజున నీ గది నుండి బయటికి వచ్చి ‘నేను మీకేం సేవ చేయగలను? అని ప్రజ లను అడుగు. నీవు చేసే సేవనీ అంతరాళంలో ఒక విప్లవాత్మక మైన మార్పును కొనితెస్తుంది. అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాంటి జీవితపు ప్లేటును ఒక్కసారిగా మార్చేస్తుంది.
ఆ సేవ అనేది నీలోని లేమిని ఖచ్చితంగా తగ్గించివేస్తుంది. నాకేం లాభం? నాకే ఎందుకిలా? లాంటి ప్రశ్నలు అడిగినప్పుడు అవి నిన్ను నిరాశతో ముంచుతాయి. ప్రజలు ఈ విధంగా నిరాశ, నిస్పృహలలో ఉండ టానికి ఆధ్యాత్మిక చింతన లేకపోవడమే కారణం.
సేవ అంటే అర్థం తెలుసా? ఆంగ్లంలోని సర్వీస్ అనే పదానికి మూలం ఇదే. సేవ అంటే దైవనిలా ఉండటం అని భావం. దైవం మననుండి ఏమీ అశించదు. నీవు ఏదైనా పనిని, ఆ పని చేయడంలోని ఆనందం తప్ప మరేమీ అశించకుండా చేసిననాడు అదే సేవ.
ఆ విధమైన అనందాన్ని సైతం భగవంతుడు అశించడు. ఎందుకంటే అతడే ఆనందస్వరూపం కదా!జ్ఞానం స్వభావం ఆనందం. కాబట్టి నీవు ఏ పనిచేసినా ఆనందంగా ఉండగలిగితే అది అనందస్వరూపం. సేవ అనేది ఫలాపేక్ష లేకుండా పనిచేయడం. ఎంత ఎక్కువగా నీవు పనిచేస్తే అంత ఎక్కువ అనందాన్ని నీవు పొందుతావు నీలో నిండి ఉన్న ప్రేమను చూడటం ధ్యానం. నీ పక్క వ్యక్తిలో దైవాన్ని చూడటం సేవ. మేం సేవ చేస్తే ఇతరులు తమను స్వార్థానికి ఉపయోగించుకుంటారేమోనని అనేకులకు భయం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ, తెలివిగా పనిచేయండి. అంతే తప్ప ద్వేషభావనను రానివ్వదు. సేవ యోగ్యతను తెస్తుంది. యోగ్యత కలిగినప్పుడు ధ్యానపు లోతుల్లోకి పోవటం సాధ్యమవ్తుంది. లోతైన ధ్యానo లో నీ చిరునవ్వు తిరిగి ఉదయిస్తుంది.
బావుంది మిత్రమా ఈ ఇన్ఫర్మేషన్. inspirational post.
Thanks