Home Tech News 2021లో వాట్సాప్ లో రానున్న కొత్త ఫీచర్లివే!

2021లో వాట్సాప్ లో రానున్న కొత్త ఫీచర్లివే!

2021లో వాట్సాప్ లో రానున్న కొత్త ఫీచర్లివే!
#new features in whatsapp 2021

పాపులర్ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో 2021లో కొత్తగా ఆరు ఆసక్తికరమైన ఫీచర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొత్త ఫీచర్లు వాట్సాప్ ను మరింత ఆకర్షణీయంగా మార్చనున్నాయి. ఆ కొత్త ఫీచర్లు …


వాట్సాప్ లో చాలా రోజులుగా యూజర్లు ఎదురుచూస్తున్న ఫీచర్ ఇది. వాట్సాప్ వెబ్ నుంచి కూడా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం ఈ ఫీచర్ అందిస్తుంది. ఇప్పటికే కొంత మంది యూజర్లు ఈ ఆడియో, వీడియో కాల్ బటన్స్ అందుకున్నట్లు కూడా వాబీటా ఇన్ఫో గత డిసెంబర్ లో వెల్లడించింది. త్వరలోనే అందరు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


ఒకటి కన్నా ఎక్కువ డివైస్లలో :

ఇప్పటి వరకూ వాట్సాప్ ను ఒకే ఫోన్లో వాడే అవకాశం ఉంది ఒక ఫోన్లో వాడుతున్న అకౌంట్ ను మరో ఫోన్లో వాడాలంటే ముందు ఇందులో నుంచి లాగౌట్ కావాల్సిందే అయితే ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ డివైస్లలో పని చేసే ఫీచర్ పై వాట్సాప్ దృష్టి సారించింది. దీనివల్ల ఒకే అకౌంట్ లో ఒకటి కన్నా ఎక్కువ డివైస్లలో లాగిన్ అయ్యే అవకాశం యూజర్లకు ఉంటుంది.


వీడియోలు పంపే ముందు మ్యూట్ :
యూజర్లు ఓ వీడియోను తమ కాంటాక్ట్లకు పంపే ముందు దానిని మ్యూట్ చేసే అవకాశం కల్పించాలని వాట్సాప్ భావిస్తోంది. ఈ ఫీచర్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఇందులో భాగంగా వీడియోలో ఎడమవైపు ఒక స్పీకర్ ఐకాన్ ఉంటుంది. యూజర్లు దానిని పంపే సమయంలో ఈ ఐకాన్ పై నొక్కితే సరిపోతుంది.


రీడ్ లేటర్ ఫీచర్ :
ఇది కూడా ఒక ఆసక్తికరమైన ఫీచరే.. ఒక చాట్ను మ్యూట్ చేసే అవకాశం దీని ద్వారా కలుగుతుంది. ఒకసారి మ్యూట్ చేస్తే ఆ చాట్ నుంచి తర్వాత వచ్చే మెసేజ్ లు సందింధించి వాట్సాప్ నోటిఫికేషన్లు పంపించదు. ఆర్కైవ్డ్ చాట్ ఫీచర్ కు ఇది మరింత మెరుగైన వెర్షన్. ఆర్కైవ్డ్ చాట్సకు సంబంధించి వాట్సాప్ ఇప్పటికీ నోటిఫికేషన్లు పంపిస్తుంది. కానీ రీడ్ లేటర్లో మ్యూట్ చేస్తే ఆ చాట్ నోటిఫికేషన్లు మళ్లీ రావు. మిస్ అయిన గ్రూప్ కాల్స్ లో ఎప్పుడైనా చేరొచ్చు ఒక గ్రూప్ నుంచి వచ్చిన వీడియో కాల్ ను మీరు మిస్ అయినా తర్వాత మధ్యలోనూ మీరు అందులో చేరే అవకాశం ఈ కొత్త ఫీచర్ కల్పిస్తుంది.

వాట్సాప్ లో ఇన్సురెన్స్ :
ఇప్పటికే వాట్సాప్ పే ఫీచర్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలుసు కదా. ఇక ఇప్పుడు తన ప్లాట్ ఫామ్ పై హెల్త్ ఇన్సూరెన్స్ మైక్రో పెన్షన్ ప్రోడక్ట్ లను కూడా తీసుకువచ్చే ఆలోచలో వాట్సాప్ ఉంది. లైసెన్స్ ఉన్న సంస్థలతో జతకట్టి ఈ ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తేనుంది. ఇప్పటికీ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ హెచ్డీఎఫ్సీ పెన్షన్లతో వాట్సాప్ చేతులు కలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here