Home News రైల్ టికెట్ బుకింగ్ ఈజీ

రైల్ టికెట్ బుకింగ్ ఈజీ

రైల్ టికెట్ బుకింగ్ ఈజీ
Train Ticket Booking Easy Now

రైల్వే టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? లేదా? అని ఆందోళన చెందుతున్నారా?.. మీరున్న స్టేషన్ నుంచి మీ గమ్యస్థానానికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ రైలు మార్గాలు ఏమున్నాయో తెలియడంలేదా? నిత్యం ప్రయాణించే మార్గాల్లోనూ టికెట్ బుకింగ్ కోసం ఇబ్బందవుతున్నదా? అయితే ఇక చింతించాల్సిన పనిలేదు. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని జోడించడంతో రైల్వే టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత సులువయింది. భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. . తాజాగా ఐఆర్‌సీటీసీకి కృత్రిమ మేధను (ఏఐ) జోడించి ఆధునీకరించింది.

ఫలితంగా ఐఆర్టీసీ వెబ్ సైట్ తోపాటు మొబైల్ యాప్ లో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి సాయంతో యూజర్లు మరింత సులువుగా రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకోగలుగుతున్నారు. ఉదాహరణకు ఐఆర్‌సీటీసీలో ఇంతకుముందు టికెట్ బుక్ చేసేటప్పుడు స్టేషన్ల వివరాలు నమోదు చేశాక రైలు పేరు మాత్రమే కనిపించేది. దానిపై క్లిక్ చేశాక తరగతిని బట్టి అందుబాటులో ఉన్న టికెట్లు, ధరలు వంటి వివరాలు వచ్చేవి. ప్రస్తుతం ఆధునీకరించిన వెబ్ సైట్ లో ప్రయాణ వివరాలను సెర్చ్ చేయగానే రైళ్లు, ఆయా తరగతుల్లో అందుబాటులో ఉన్న సీట్లు, ధరలతోపాటు ఇతర అనేక వివరాలు ప్రత్యక్షమవుతున్నాయి. టికెట్ కన్ఫర్మేషన్ కు ఉన్న అవకాశాలను కూడా అక్కడ శాతాల రూపంలో చూపిస్తుంది. ఆప్షన్ వల్ల ప్రయాణికులతోపాటు రైల్వేకు సైతం లాభం చేకూరనున్నది. ఏ మార్గంలో ఎక్కువమంది ప్రయాణికులు ప్రయాణం చేయాలనుకుంటున్నారో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని ఆయా మార్గాల్లో కొత్తగా మరో ప్రత్యేక రైలును నడిపేందుకు కూడా వీలవుతుంది.

అత్యాధునిక ఫీచర్లు ఇవే ఇంతకుముందు అందుబాటులో ఉన్నాయనుకొని బుక్ చేసేలోపు టికెట్లు అయిపోయాయనే సందేశం వచ్చేది. రైల్వే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. టికెట్ బుకింగ్ అయ్యాక వెయిటింగ్ లిస్టు అనే స్టేటస్ కనిపించేది. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఇలా ఎక్కువగా జరిగేది. తాజాగా ఆధునీకరించిన ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లో క్యాచీ సిస్టమ్ ను జోడించారు. దీనివల్ల ఎప్పటికప్పుడు ఎన్నిసీట్లు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. వెబ్ పేజీలను రీఫ్రెష్, రీలోడ్ చేయకుండానే సీట్ల అందుబాటు వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. రైల్వే టికెట్ తోపాటే బస చేసేందుకు గదులు, హోటళ్లను బుక్ చేసుకునే అవకాశం ఉన్నది. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరిన తర్వాత వాటికోసం ప్రత్యేకంగా వెతుక్కునే శ్రమ తప్పుతుంది. తరుచూ వెళ్లే రైలు లేదా తరుచూ వెళ్లే మార్గాల్లో సులభంగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం కూడా ఉన్నది. వెళ్లాల్సిన రైలుకు సంబంధించిన సమాచారం ఒక్క పేజీలోనే కనిపించేలా చేశారు సెర్చింగ్ విధానాన్ని సులభతరం చేశారు. కొత్త వెర్షన్ లో సైబర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.
టికెట్ బుకింగ్ చేసినప్పుడు వినియోగించిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు వినియోగదారుని అనుమతితోనే వెబ్ సైట్ లో సేవ్ అవుతాయి. స్మార్ట్ బుకింగ్ పైనా కసరత్తు భవిష్యత్తులో రైల్వే టికెటింగ్ లో స్మార్ట్ బుకింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు ఐఆర్‌సీటీసీ, సీఆర్ఎస్లు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మనం ప్రయాణించాల్సిన మార్గానికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుంది. అంటే.. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ వెళ్లడానికి ఉన్న అన్ని రైల్వే మార్గాలను స్మార్ట్ బుకింగ్ ఫీచర్ లో అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. 5 లక్షల మంది లాగిన్ అయినా.. ప్రస్తుతం భారత రైల్వేకు దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. రోజుకు 8 లక్షల మంది టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఇందులో 83 శాతం ఆన్ లైన్ లోనే బుక్ అవుతున్నాయి. వెబ్ సైట్, యాప్ వినియోగం భారీస్థాయిలో ఉండటంతో ఏఐని వాడుతున్నారు. ఒకేసారి 5 లక్షల మంది వినియోగదారులు ఉపయోగించినా సర్వర్ డౌన్ కాకుండా ఉంటుంది. ఈ సాంకేతికతతో చాలా వేగంగా స్పందిస్తూ బుకింగను సులభతరం చేస్తుందని రైల్వేశాఖ అధికారులు చెప్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here