Home Lyrics “Laagelaata Soodu Vadhine” Song Lyrics

“Laagelaata Soodu Vadhine” Song Lyrics

“Laagelaata Soodu Vadhine” Song Lyrics
Image creadit to Maniar musics youtube

Laagelaata Soodu Vadhine Folk Song Lyrics| DJ SONG FULL SONG 2021 | #LAVANYA #PARSHURAMNAGAM @MANAIR MUSIC & MOVIES

“Laagelaata Soodu Vadhine” Song Info

“Laagelaata Soodu Vadhine” Song Lyrics

Laagelaata Soodu Vadhine Song Lyrics

లాగెలున్న దొడ్లెకు పెండదియ్య వొమ్మంటే.. (2)
లాగేలాట అడుతాడు సూడు వదినే..
లాగెలున్న దొడ్లెకు..పెండదియ్య వొమ్మంటే..

ముసాలోడే కుశాలు వడుతాడు (2)
ముద్దు లియ్యుమంటాడు సూడు వదినే..
మూసాలోడే గాని..కుశాలు వడుతాడు..

చరణం:1
మొండి కర్రు వట్టుకొని ..సర్రిపియ్యా వొమ్మంటే.(2)
సిర్ర గొనెలాడుతాడు.. సూడు వదినే..
మొండి కర్రు వట్టుకొని ..సర్ర్పియ్యా వొమ్మంటే.

మూసాలోడే గాని..ఏశాలు వడుతాడు.. (2)
సీరేకొంగునిడువడు.. సూడు వదినే
మూసాలోడే గాని.. ఏశాలు వడుతాడు

చరణం:2:

సికిపోయిన కట్టేలు సెక్కలేసి రమ్మంటే..(2)
సిందూలాట లాడుతాడు సూడు వదినే
సికిపోయిన కట్టేలు సెక్కలేసి రమ్మంటే..

మూసాలోడే గాని.. మూసిముసి నవ్వుతాడు (2)
రెక్క వట్టుకుంటాడు సూడు వదినే..
మూసాలోడే గాని.. మూసిముసి నవ్వుతాడు..

చరణం:3
పందిరెక్కి ఆయిలాకు తక్కల్లాకు ఎయ్యిమంటే..
సయ్యాటలాడుతాడు సూడు వదినే..
పందిరెక్కి ఆయిలాకు తక్కల్లాకు ఎయ్యిమంటే

ముసాలోడే గాని.. పడుసూ బుద్ధి వోలేదు..(2)
పక పక నవ్వుతాడు సూడు వదినే..
ముసాలోడే గాని.. పడుసూ బుద్ధి వోలేదు..

చరణం:4
అంకాయ ఆలుగడ్డ.. బెండకాయ దొండకాయ..
కూరగాయలమ్ముకచ్చి.. కూడబెట్టుకుందమంటే..
కాయలాట ఆడుతాడు సూడు వదినే..
కూరగాయలమ్ముకచ్చి.. కూడబెట్టుకుందమంటే..

రేపటి రోజుకు కోల్యాగైతాడా (2)
సీటీలు గొడుతడు .. సూడు వదినే..
రేపటి రోజుకు కోల్యాగైతాడా …

అంత్యపల్లవి:
సింత ముసలైన… పులుపు సావదట..(2)
సోకుల వడుతాడు .. సూడు వదినే..
సింత ముసలైన… పులుపు సావదట..

వదిన:
ప్రేమకు వయసా.. మనసుకు, ముసలా..
మనసు ముసలిదా.. మరుదాలా
“”నిత్య నూతనం మరుదాలా..
పచ్చ తోరణమై.. మీరుండాలా..”” (3)

“Laagelaata Soodu Vadhine” Song Video

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here