Home Tech News ఈ దీపావళికే మార్కెట్లోకి విడుదలకానున్న జియోఫోన్ నెక్స్ట్ పూర్తీ వివరాలు ప్రకటించిన సుందర్ పిచాయ్ | jio phone next Specifications and complete details.

ఈ దీపావళికే మార్కెట్లోకి విడుదలకానున్న జియోఫోన్ నెక్స్ట్ పూర్తీ వివరాలు ప్రకటించిన సుందర్ పిచాయ్ | jio phone next Specifications and complete details.

ఈ దీపావళికే మార్కెట్లోకి విడుదలకానున్న జియోఫోన్ నెక్స్ట్ పూర్తీ వివరాలు ప్రకటించిన సుందర్ పిచాయ్ | jio phone next Specifications and complete details.
జియోఫోన్ నెక్స్ట్ పూర్తీ వివరాలు

రిలయన్స్ జియో సంచలన 4జీ స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్స్ట్ , దీపావళికే మార్కెట్లోకి విడుదల అవుతుందని గూగుల్ సీఈవో, భారత సంతతి టెక్కీ సుందర్ పిచాయ్ ప్రకటించారు. గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ ఆర్థిక ఫలితాల సందర్భంగా బుధవారం పిచాయ్ ఈ మేరకు స్పష్టం చేశారు. జియోఫోన్ నెక్స్ట్ ను జియో, గూగుల్ కలిసి తయారు చేస్తున్న విషయం తెలిసిందే.


నిజానికి ఇప్పటికే అందుబాటులోకి రావాల్సి ఉన్న ఈ మొబైలు సెమీకండక్టర్ (చిప్)ల కొరత అడ్డుపడింది. కాగా, ఈ ఫోన్ ని ట్రాన్స్లేషన్ ఆప్షన్.. వినియోగదారులకు ఎంతగానో లాభించగలదన్న విశ్వాసాన్ని పిచాయ్ వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫోన్లోని ఫీచర్లు, కొన్ని విశేషాలు బయటకు రాగా, దేశంలోని సుమారు 30 కోట్ల 2జీ కస్టమర్లే లక్ష్యంగా వస్తున్న ఈ చౌక స్మార్ట్ ఫోన్ ధర దాదాపు రూ.5,000లుగా ఉండొచ్చన్న అంచనాలు మార్కెట్లో వినిపిస్తున్నాయి.


జియోఫోన్ నెక్స్ట్ ఫీచర్స్?

5.5 అంగుళాల HD ప్లస్ డిస్ప్లే 2జీబీ, 3జీబీ ర్యామ్ వేరియంట్స్
16జీబీ, 32జీబీ స్టోరేజీ ఆప్షన్లు
ఎస్ డి కార్డుతో స్టోరేజీ పెంచుకునే వీలు
13 మెగాపిక్సల్ బ్యాక్, 8ఎంపీ ఫ్రంట్ కెమెరాలు
2,500 మెగాహెట్జ్ బ్యాటరీ
స్నాప్ డ్రాగన్ 215 చిప్
మైక్రో-యూఎస్బీ పోర్ట్ చార్జింగ్

విశేషాలు
వాయిస్ అసిస్టెంట్
రీడ్ అలౌడ్
ట్రాన్స్ లేట్ జి
ఈజీ అండ్ స్మార్ట్ కెమెరా
జియో, గూగుల్ యాప్స్ ప్రీలోడెడ్
ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ అప్ గ్రేడ్
లాంగ్ లైఫ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here