
ఆకాశం లో ఆశల హరివిల్లూ ఆనందాలే పూసిన పొదరిల్లూ
అందమైనా ఆ ఆలోకం అందుకొన
ఆదమరిచీ కలకాలం వున్డిపొన |ఆ||
మబ్బుల్లో తూలుతున్న మెరుపై పోనా వయ్యారి వాన జల్లై దిగిరానా
సంద్రం లో పోంగుతున్న అలనై పోనా
సన్దెల్లొ రంగులెన్నో చిలికేయ్ న
పిల్లగాలె పల్లకీగా
దిక్కులనే చుట్టి రానా
నాకోసం నవరాగాలే నాట్యమాడేనుగా
|| |
స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల సంగీతం
ముద్దొచ్చే తారాలెన్నో మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖ ద్వారం
శోభలూ రే సోయగానా
చందమామ మందిరానా
నాకోసం సుర భోగాలే వేచి నిలిచేనుగా