
చందమామ కధలో చదివా రెక్కల గుర్రలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
బాల మిత్ర కధలో చదివా పగడపు దీవులు ఉంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
నా కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తావనీ
పగడపు దీవి కి నువ్వే నన్ను తీసుకెళ్తావనీ
ఇక ఏనాటికీ అక్కడే మనం ఉంటామనీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో
నువ్వే నాకు ముద్దొస్తావనీ
నేనే నీకు ముద్దిస్తాననీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో
వరహాల బాటలోనా.. రతనాల తోటలోన
వజ్రాల మేడలోన.. బంగరు గదిలోన
విరి తేనెల్లో పాలల్లో తానా లాడేసి
నెల వంకల్లో వెన్నెల్నే భోంచేసి
నలుదిక్కుల్లో చుక్కల్నే చిలకలు చుట్టేసి
చిలకే కొరికి ..దరికే జరిగి మురిపెం పెరిగి
మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
ముద్దుల్లోన ముద్దవుతాననీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో
చందమామ కధలో చదివా రెక్కల గుర్రలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో
ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి
నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా
అహ కోనల్లో కొమ్మల్లో ఉయ్యలూగేసి
ఆ కొమ్మల్లో పళ్ళన్నీ రుచి చూసి
అహ పళ్ళళ్ళో మైకం తో మోహం కమ్మేసి
చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా
మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ
తడి వేదాలు ముద్రిస్తావనీ
నమ్మడానికి ఎంత బాగుందో
నీ కోసం రెక్కల గుర్రం ఎక్కి వస్తానని
పగడపు దీవి కి నిన్నే నేను తీసుకెళ్తాననీ
ఇక ఏనాటికీ అక్కడే మనం ఉంటామని
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో
“Chandamama Kadhalo Chadiva” Song Video
E Abbayi Chala Manchodu : Ch , amama Kadhalo Chadiva