“Cheppave Chirugal” Song Lyrics

చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి
ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి
ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి

ఆశ దీపికలై మెరిసే తారకలు చూసే దీపికలై విరిసే కోరికలు
మనతో జతై సాగుతుంటే హో అడుగే అలై పొంగుతుంది
ఆ…చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు
దిక్కులు తెంచుకు దూసుకుపోతు ఉంటే ఆపగలవా షికారులు
కురిసే సుగంధాల హోళి ఓ చూపదా వసంతాలకేళీ
కురిసే సుగంధాల హోళి ఓ చూపదా వసంతాలకేళీ

యమునా తీరాల కధ వినిపించేలా రాధామాధవుల జత కనిపించేలా
పాడనీ వెన్నెల్లో ఈ వేళ చెవిలో సన్నయి రాగంలా
ఓ…కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాల
లాహిరి లాహిరి లాహిరి తారంగాల రాతిరి ఏదని ఈదే వేళ
జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి
ఊపిరే ఉల్లసంగా తుళ్ళీ హో చూపదా వసంతాల కేళీ
ఊపిరే ఉల్లసంగా తుళ్ళీ హో చూపదా వసంతాల కేళీ

“Cheppave Chirugal” Song Video

Leave a Comment