
కలయా… నిజమా… తొలిరేయి హాయి మహిమా ||2||
అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆప తరమా
అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా
||కలయా||
లేనిపోని ఏ కూనిరాగమో లేచిరా అంటున్నదీ.. అహా…
ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవా అంటున్నదీ..
కోక ముళ్ళ కూపీ తీసే కైపు చూపు కొరుకుతున్నది
కుర్ర కళ్ళు చీర గళ్ళలొ దారే లేక తిరుగుతున్నవి
ముంచే మైకమో… మురిపించే మోహమో
||కలయా||
చేయి వేయనా సేవ చేయనా ఓయ్ అనే వయ్యారమా.. హహ హ..
పాల ముంచినా నీట ముంచినా నీ దయే స్రింగారమా… అహా…
ఆగలేని ఆకలేవిటొ పైకి పైకి దూకుతున్నది
కాలు నేల నిలవకున్నది ఆకశాన తేలుతున్నది
హా అంతా మాయగా అనిపించే కాలమూ
||కలయా||