కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ జేసి అంతలోనే మౌనమేలనే

మాటరాని మౌనం …..మనసే తెలిపే
ఎద చాటు మాటు గానం కనులే కలిపే ఈ వేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది
పగలే రేయైనా యుగమే క్షణమైనా కాలం నీ తోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు కరగనీ
ఒడిలో వాలాలనున్నది ….వద్దని సిగ్గాపుతున్నది
తడబడు గుండేలలో మోమాటమిది
కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ జేసి అంతలోనే మౌనమేలనే
కళ్ళల్లో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటు తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే …నా ఊపిరి నీకై నిలిచెనే
చావుకు భయపడనే నువ్వుంటే చెంత
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది
మాటరాని మౌనం …..మనసే తెలిపే
ఎద చాటు మాటు గానం కనులే కలిపే ఈ వేళ
కంటి చూపుతో నీ కంటి చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే