మన్నించు ఓ ప్రేమ! మురిపించుకోకమ్మా
మౌనాలు కరిగించేలా మాటాడుమా
మన్నించు ఓ ప్రేమ! మరుగేల చెప్పమ్మా
దరిచేరు దారేదైనా చూపించుమా
చెప్పనంటు దాచడానికైన
అంత చెప్పరాని మాట కాదు అవునా
ఇంత మంచి వేళ ఎదురైనా మరి చెప్పుకోవ ఇంక ఇపుడైనా
పట్టరాని ఆశ పెంచుకున్నా
అది మోయరాని భారమవుతున్నా
చెప్పుకుంటె తప్పులేదు అయిన
నువ్వు ఒప్పుకోవు ఏమో అనుకున్న
జంట కమ్మని వెంట రమ్మని పిలిచే నేస్తమా
కొంత చేరువై కొంత దూరమై ఉంటే న్యాయమా
రెండు చేతుల అందుకోమని అనవేం స్నేహమా
చెంత నిలిచినా చేయి కలపవేం నాదే నేరమా
చొరవగా పొదువుకో నడిపే ప్రణయమా
బిడియమే వదులుకో బెదిరే ప్రియతమా
తగిన తరుణమని ఉదయ కిరణమై
ఎదురు పడిన వరమా
అన్ని వైపుల చెలిమి కాపల అల్లే బంధమా
మబ్బులో అలా దాగితే ఎలా దిగిరా చంద్రమా
నిదురలో అలా నిలిపోకలా మెరిసే స్వప్నమా
కంటిపాపలో కబురులేమిటో చెబితే పాపమా
తలపులే తెలుపవే నాలో ప్రాణమా
పెదవిపై పలకవేం ఊహాగానమా
మదిని మీటినది నీవు కాద మరి మధురమైన స్వరమా