” Osari Preminchaka” Song Lyrics

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానేరాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయే వీలే లేదమ్మా
నీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా
ఆరాటాలే ఎగసి అణువు అణువు తడిసి ఇంకా ఇంకా బిగిసిందీ ప్రేమా

ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానేరాదమ్మా
అనుకోకుండా నీ యద నిండా పొంగింది ఈ ప్రేమా
అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమా
అనుకోని అతిధిని పొమ్మంటూ తరిమే అధికారం లేదమ్మా
స్వార్ధం లేని త్యాగాలనే చేసేదే ఈ ప్రేమా
త్యాగంలోనా ఆనందాన్నే చూసేదే ఈ ప్రేమా

ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా
ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రానేరాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక విడిపోయే వీలే లేదమ్మా
నీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా
ఆరాటాలే ఎగసి అణువు అణువు తడిసి ఇంకా ఇంకా బిగిసిందీ ప్రేమా

“| Osari Preminchaka” Song Video

Leave a Comment