In Teluguinfo site you will find Latest Telugu movie songs lyrics in both Telugu and English, No 1 Telugu lyrics website updates daily Telugu cinema lyrics collection. and you can find Health, Jobs, Education and Entertainment news in telugu.
నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో ఓ ఓ ఓఓ ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో ఓ ఓ ఓఓ
నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందు నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో
ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళీ మంత్రాలుగా అటు వైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమై పోదామా ఆ ఆఆ
ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమా నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్లి పొమ్మంటుంది ప్రేమా ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ
ఈ కాలం కన్న ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి నిను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోని ఏ చీకటైన క్షణకాలమంటు నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమా ఆ ఆ ఆఆ
నీతో ఇలా ఏ బెరుకు లేకుండా నువ్వే ఇగా నా బతుకు అంటున్న
నా నిన్న నేడు రేపు కుర్చీ నీకై పరిచానే తలగడగా నీ తలని వాల్చి కళ్ళు తెరిచి నా ఈ దునియా మిల మిల చూడే
వచ్చే మలుపులు రాస్త వెలుగులు జారే చినుకుల జల్లే పరుగు పేకాఆ మల్లె నిన్ను నన్ను అల్లే పొద్దే తెలియక గల్లీ పొడుగునా ఆడే పిల్లల హోరే నాకంటూ ఉందింతే ఉందంతా ఇక నీకే
ఏయ్ పిల్ల పరుగున పోదామా ఏ వైపో జంటగా ఉందామా
పారే నదై నా కళలు ఉన్నాయే చేరే దారే ఓ వెదుకుతున్నాయే
నా గుండె ఓలి చేసి ఆచి తూచి అందించా జాతరల ఆ క్షణము చాటి పైన జోలీ చూసా లోకం మెరుపులా జాడే
నింగిన మబ్బులు ఇచ్చే బహుమతి నేలన కనిపిస్తుంది మారే నీడలు గీసే తేలే బొమ్మలు చూడే పట్నం చేరిన పాల పుంతలు పల్లెల సంతల బారి నాకంటూ ఉందింతే ఉందంతా ఇక నీకే
లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ
కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి మాటలు అన్ని మరిసిపోయా నీళ్ళే నమిలేసి
ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందడొచ్చేరా వేప చెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చేరా
నా కొంగు చివర దాచుకున్నా చిల్లరే నువ్వురా రాతిరంత నిదురపోని అల్లరే నీదిరా మొడుబారి పోయి ఉన్నా అడవిలాంటి ఆశకేమో ఒక్కసారి చివురులొచ్చేరా
నా మనసే నీ వెనకే తిరిగినదీ నీ మనసే నాకిమ్మని అడిగినదీ
లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ
గోపురానా వాలి ఉన్నా పావురాయిలా ఎంత ఎదురు చూసినానో అన్ని ధిక్కులా నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగా చిట్టి గుండె గంతులేసే చెవుల పిల్లిలా
నా మనసు విప్పి చెప్పనా సిగ్గు విడిచి చెప్పనా నువ్వు తప్ప ఎవ్వరొద్దులేరా నే ఉగ్గబట్టి ఉంచినా అగ్గి అగ్గి మంటనీ బుగ్గ గిల్లి బుజ్జగించుకోరా
నీ సూదిలాంటి చూపుతో ధారమంటి నవ్వుతో నిన్ను నన్ను ఒకటిగా కలిపి కుట్టరా నా నుదిటి మీద వెచ్చగా ముద్దు బొట్టు పెట్టారా కుట్టి కుట్టి పోరాఆ ఆ కందిరీగ లాగా చుట్టు చుట్టుకోరా ఆ ఆ కొండచిలువ లాగా
నీ పక్కనుంటే చాలురా పులస చేప పులుసులా వయసు ఉడికిపోద్ది తస్సదియ్యా నే వేడి వేడి విస్తరై తీర్చుతాను ఆకలి మూడు పూట్ల ఆరగించరయ్య నా చేతి వేళ్ళ మెటికలు విరుచుకోర మెల్లిగా చీరకున్నా మడతలే చక్కబెట్టారా
నీ పిచ్చి పట్టుకుందిరా వదిలిపెట్టనందిరా నిన్ను గుచ్చుకుంటా ఆ ఆ నల్లపూసలాగా అంటిపెట్టుకుంటా ఆ ఆ వెన్నుపూసలాగా
లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ
నే అవ్వసాటు ఆడపిల్లనయ్యో పిల్లనయ్యో, ఆడపిల్లనయ్యో మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో ప్రేమనయ్యో, నేను ప్రేమనయ్యో
ఏడు గడపలల్లో ఒక్కదాన్నిరయ్యో దాన్నిరయ్యో, ఒక్కదాన్నిరయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో, నేను ప్రాణమయ్యో
పండు ఎన్నల్లో ఎత్తుకొని ఎన్న ముద్దలు వెట్టుకొని ఎన్ని మారాలు జేస్తు ఉన్నా నన్ను గారాలు జేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను నీ చేతికిస్తారా నన్నేరా నేను
నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా వెట్టినంకుల్లో, వెట్టినంకా సిరిసంపద సంబురం గల్గునింకా గల్గునింకుల్లో, గల్గునింకా
నిన్ను గన్నోల్లే కన్నోల్లు అన్నుకుంటా అన్నుకుంటుల్లో, అన్నుకుంటా నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా పంచుకుంటుల్లో, పంచుకుంటా
సుక్క పొద్దుకే నిద్రలేసి సుక్కలా ముగ్గులాకిట్లేసి సుక్కలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా ఏడు జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా