Home Blog Page 184

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి

జమ్ముకశ్మీర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న విషయం తెలుసు కదా. మూడేళ్ల కిందట దీని నిర్మాణం ప్రారంభం కాగా ప్రస్తుతం దీని ప్రధాన ఆర్క్ దాదాపు పూర్తి కావస్తోంది. దీనిపై తాజాగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అప్డేట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ అద్భుత కట్టడం సిద్ధమవుతోంది అంటూ ఆయన కామెంట్ చేశారు. మరో ఇంజినీరింగ్ మైలురాయిని అందుకునే దిశగా ఇండియన్ రైల్వేస్ అడుగులు వేస్తోందని ఆయన చెప్పారు. 476 మీటర్ల పొడువైన స్టీల్ ఆర్క్ ను ఇందులో చూడొచ్చు. ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ రైల్వే బ్రిడ్జిని జమ్ముకశ్మీర్లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు

కశ్మీర్ను మిగతా దేశంతో కలిపే రైల్వే ప్రాజెక్ట్ లో భాగంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. 2017, నవంబర్లో దీని నిర్మాణం ప్రారంభమైంది. దీనికి రూ.1250 కోట్లు ఖర్చవుతుందని అంచనా. చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మిస్తున్నారు. అంటే ఇది ప్యారిస్ ని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ఎత్తు కంటే కూడా 35 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. 8 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో వచ్చే భూకంపాలను కూడా తట్టుకునే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 1315 మీటర్లు.

ఉల్లి రసంతో బొజ్జ మాయం

బొజ్జ బాగా పెరిగిందని బెంగపెట్టుకున్నారా? అయితే ఈ చిట్కాను తప్పకుండా పాటించండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఉల్లి సకల రోగాల నివారిణి. దాన్ని పచ్చిగా తినినా కూరలో వేసుకున్నా అందులోని పోషకాలు ఎప్పుడూ శరీరానికి మేలే చేస్తాయి. ముఖ్యంగా శరీరంలో కొవు నిల్వలు పెరగకుండా సహాయపడుతుంది. ఉల్లిలో ఉండే ‘క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్ శరీరంలో పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. మెటబాలిజంను పెంపొందించి కొవ్వు  పేరుకుపోవడం తగ్గిస్తుంది. 

ఉల్లిపాయలో కేలరీలు, సోడియం, కొలెస్ట్రాల్ తక్కువ కాబట్టి.. బరువు పెరుగుతామనే బెంగ కూడా అవసరం లేదు. ఉల్లితో బరువు తగ్గాలంటే ఈ కింది చిట్కాను పాటించండి. ఉల్లిపాయను రసంగా చేసుకుని తేనెతో కలపి పరగడుపునే తాగండి. రోజు విడిచి రోజు ఇలా తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రసం పొట్ట భాగంతోపాటు ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుంది.

ఇలా తయారు చేయండి :

ఉల్లిపాయ రసం, తెనే మిశ్రమం తయారీ కోసం పెద్ద పరిమాణంలో ఉన్న ఒక ఉల్లిపాయ తగిన మోతాదులో నీరు తీసుకోండి.

ఉల్లి రసంలో కలిపేం దుకు 1-2టీ స్పూన్ల తేనె అసవరం. ముందుగా ఉల్లిపాయ పొట్టు తీసి ముక్కులు చేయండి. అనంతరం ఆ ముక్కలను మిక్సిలో వేసి రుబ్బండి.

దానికి తగిన మోతాదులో నీరు, తేనె కలపండి. అంతే.. రసం సిద్ధమైపో తుంది. ఉల్లి గుజ్జుతో తాగడం ఇబ్బంది అనిపిస్తే.. ఒక శుభ్రమైన క్లాత్లోకి కలపడానికి ముందే ఉల్లి రసాన్ని వడపోయండి.

రోజుకు 3 సార్లు బ్రష్ చేస్తే గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందట

నోరు, దంతాలు పరిశుభ్రంగా ఉండకపోతే రక్తంలో బాక్టీరియా పెరిగి తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని గతంలో సైంటిస్టులు తమ పరిశోధనల్లో వెల్లడించిన విషయం విదితమే. అందుకనే వైద్యులు నోరు, దంతాలను సురక్షితంగా ఉంచుకుంటే గుండె జబ్బులు రావని చెబుతుంటారు. అయితే నిత్యం 3 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు దంతధావనం చేస్తే దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన తాజా… అధ్యయనాల్లో వెల్లడైంది. దక్షిణ కొరియాలోని కొరియన్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్కు చెందిన 40 నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న 1,61, 286 మందిపై అక్కడి సైంటిస్టులు 10.5 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు.

‘ఆ సమయంలో వారి ఎత్తు, బరువు, వారికున్న అనారోగ్య సమస్యలు, జీవన విధానం, దంతాలు, నోటి ఆరోగ్యం తదితర వివరాలను సేకరించారు. ఈ క్రమంలో అన్ని వివరాలను విశ్లేషించి చివరకు సైంటిస్టులు తేల్చింది ఏమిటంటే నిత్యం 3 అంతకన్నా ఎక్కువ సార్లు బ్రష్ చేసుకునేవారి హార్ట్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశాలు 12 శాత వరకు తగ్గుతాయని, అలాగే ఆట్రియల్ ఫైబ్రి లేషన్ వంటి గుండె సమస్యలు వచ్చే అవకాశం 10 శతం వరకు తక్కువగా ఉంటాయని చెప్పారు. అందుకని ప్రతి ఒక్కరు తమ దంతాలు నోటి పరిశుబ్రత పై దృష్టి పెట్టాలని సదరు సైంటిస్టులు సుచిస్తున్నారు

42 ఏళ్ల వయసులో తలైన హీరోయిన్ సంఘవి

ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో గుర్తింపు పొందిన హీరోయిన్ సంఘవి మీకు గుర్తున్నారా? తెలుగులో తక్కువ సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ అప్పట్లో ఒక వెలుగు వెలిగింది. తెలుగులో సింధూరం, సమరసింహారెడ్డి వంటి బాక్సాఫీస్ చిత్రాల్లో నటించిన సంఘవి మంచి గుర్తింపు పొందారు. శ్రీకాంత్ హీరోగా నటించిన తాజ్మహల్ సినిమాతో తెరంగేట్రం చేసిన సంఘవి.. అసలు పేరు కావ్య. సీతారామరాజు, ఆహా, సూర్యవంశం, మృగరాజు, గొప్పింటి అల్లుడు. ప్రేయసిరావే, సందడే సందడి, రవన్న, శివయ్య, తాతా మనవడు.. ఇలా దాదాపు 40 సినిమాల్లో నటించి హోమ్లీ హీరోయిన్గా పేరు గడించారు. గ్లామర్ చిత్రాల్లో నటించిన సంఘవి.. యువతను ఆకర్శించేలా మోడ్రన్ డ్రస్సుల్లోనూ అలరించింది.

సినిమా హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలోనే 39 ఏండ్ల వయసులో ఐటీ సంస్థ యజమాని వెంకటేశ్ తో 2016 లో సంఘవి వివాహమైంది. ఆ తర్వాత కొన్ని ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్లకు జడ్జిగా హాజరై తెలుగు టీవీ ప్రేక్షకులను పలుకరించింది. అయితే, ఇటీవల సంఘవి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కూతురును ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్న ఫొటోను తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసింది. 42 ఏండ వయసులో సంఘవి పాపకు జన్మనివ్వడం తో అభిమానులు ఆశ్చర్యంతోపాటు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.


15 ఏండ్ల సినీ కెరీర్లో తెలుగు, కన్నడ, తమిళం, మళయాల భాషల్లో నటించిన సంఘవి. తెలుగులో చిరంజీవి. నాగార్జున, వెంకటేశ్, రవితేజ, ఎన్టీఆర్, శ్రీకాంత్, రాజశేఖర్ వంటి హీరోల సరసన నటించి మెప్పించారు. 2004లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆంధ్రావాలా అనంతరం ఒక్కటి కానీ ఇద్దరు అనే తెలుగు సినిమాలో ప్రత్యేక క్యారెక్టర్ చేసింది. అనంతరం సినిమాలకు గుడ్ బై చెప్పి ఇంటికే పరిమితమైంది.

ఊపిరితిత్తులు బలంగా అవ్వాలా? ఇలా చేయండి|Best Lunges Exercise

కరోనా వైరస్ సోకితే ముందుగా ప్రభావితమయ్యేవి ఊపిరితిత్తులే ! కొవిడ్ 19 నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సమస్యలు చాలా రోజుల వరకు వెంటాడుతూనే ఉన్నాయి. అంటే వైరస్ పూర్తిగా తగ్గిపోయినా.. దాని ప్రభావం వల్ల ఊపిరితిత్తులు యథాస్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఊపిరితిత్తుల ఆరోగ్యం కాపాడుకోవడం చాలా అవసరం. అందుకే కరోనా బారిన పడి దెబ్బతిన్న ఊపిరితిత్తులు తిరిగి యథాస్థితికి చేరుకునేందుకు ఫిజియోథెరపిస్టులు కొన్ని వ్యాయామాలను సూచిస్తున్నారు. ప్రతి రోజు ఈ ఎక్సర్సైజ్లను 6 నుంచి 7 సార్లు చేయాలని చెబుతున్నారు. మరి అవేంటో ఒకసారి చూద్దామా..

ఊపిరితిత్తులు బలంగా అవ్వాలా? ఇలా చేయండి


స్పైరో మీటర్

spirometer

ఒక మెషిన్ లో మూడు బాల్స్ ఉండే ఈ స్పైరో మీటర్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఊపిరితిత్తులను బలంగా చేసేందుకు ఈ వ్యాయామం చక్కగా పనిచేస్తుంది. ఈ స్పైరో మీటర్కు ఉండే చిన్న పైపును నోట్లో పెట్టుకుని.. బలంగా శ్వాస తీసుకోవాలి. మెషిన్లో ఉన్న బాల్స్ పైకి వచ్చేలా గాలిని బలంగా పీల్చుకోవాలి. ఆ తర్వాత ముక్కు నుంచి గాలిని నెమ్మదిగా బయటకు వదలాలి. ఈ సమయంలో మెషిన్లోని బాల్స్ జెర్క్ ఇచ్చినట్టుగా ఒక్కసారిగా కిందపడకూడదు. ఒకేరకంగా బాల్స్ పైకి లేచి.. మళ్లీ కిందకు రావాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి.


ముక్కుతో శ్వాస తీసుకుని నోటితో వదలాలి

ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరచుకోవడంలో ఇది మరో చక్క వ్యాయామం. ఇందులో భాగంగా ముందు నోటిని మూసుకుని ముక్కు ద్వారా బలంగా శ్వాస తీసుకోవాలి. ఆ తర్వాత పీల్చిన గాలిని నెమ్మదిగా నోటి ద్వారా వదలాలి. ఇలా ఒక రోజులో కనీసం 6 నుంచి 7 సార్లు చేయాలి.


ఓంకారం

యోగ ముద్రలో కూర్చొని ఓంకారం ఉచ్ఛరిస్తూ శ్వాస మీద ధ్యాస పెంచే ఈ వ్యాయామం గురించి చాలామందికి తెలుసు. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరచుకోవడంలో ఇది పురాతనం నుంచి వస్తున్న ఓ చక్కటి పద్ధతి. పొట్ట నుంచి ఓం శబ్దం ఉచ్చరిస్తూ గట్టిగా శ్వాస తీసుకుని వదలడం ద్వారా ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి. అయితే ఓంకారం శబ్దం చేసేటప్పుడు దీర్ఘం తీసినట్టుగా అంటూ శ్వాస తీసుకుని వదిలితే మంచి ఫలితం ఉంటుంది.


మరో వ్యాయమం

శ్వాసకు తగ్గట్టుగా ఊపిరితిత్తులను ముందుకు వెనక్కి కదిలించడం ద్వారా కూడా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఇందుకోసం రెండు పద్ధతులు ఉన్నాయి. రెండు చేతులను ముందుకు పెట్టాలి. బలంగా శ్వాస తీసుకుంటూ చేతులను వెనక్కి తీసుకెళ్లాలి. శ్వాసకు తగ్గట్టుగా చేతులు వెనక్కి వెళ్లాలి. అలాగే శ్వాస వదులుతూ మళ్లీ చేతులను ముందు వైపుకు తీసుకురావాలి. ముందుగా రెండు చేతులను తల వెనుక భాగంలో పెట్టుకోవాలి. ఆ తర్వాత రెండు మోచేతులను తల ముందు భాగం వైపు దగ్గరగా తీసుకురావాలి. ఇప్పుడు బలంగా శ్వాస తీసుకుంటూ.. రెండు మోచేతులను దూరంగా తీసుకెళ్లాలి. శ్వాస తీసుకునే క్రమానికి తగ్గట్టుగా మోచేతులను దూరంగా తీసుకెళ్లాలి. అదేవిధంగా శ్వాసను వదులుతూ రెండు మోచేతులను దగ్గరగా తీసుకురావాలి.

బెలూన్ ఊదడం

ఊపిరితిత్తులు తొందరగా కోలుకోవడానికి ఎక్కువగా సూచించే పద్ధతి ఇది. అలా అని దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. బెలూన్లలో గాలి నింపడానికి బలంగా ఊదాల్సి ఉంటుంది. దీనివల్ల ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి.


వాకింగ్

ఊపిరితిత్తుల స్థితిని బట్టి వాకింగ్ చేయడం దినచర్యలో భాగం చేసుకోవాలి. ప్రస్తుతం పరిస్థితుల్లో పార్కులు,
బయటకు వెళ్లే బదులు ఇంటి వరణలోనే వాకింగ్ చేయడం ఉత్తమం.