Home Blog Page 186

రైల్ టికెట్ బుకింగ్ ఈజీ

రైల్వే టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? లేదా? అని ఆందోళన చెందుతున్నారా?.. మీరున్న స్టేషన్ నుంచి మీ గమ్యస్థానానికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ రైలు మార్గాలు ఏమున్నాయో తెలియడంలేదా? నిత్యం ప్రయాణించే మార్గాల్లోనూ టికెట్ బుకింగ్ కోసం ఇబ్బందవుతున్నదా? అయితే ఇక చింతించాల్సిన పనిలేదు. ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని జోడించడంతో రైల్వే టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత సులువయింది. భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది. . తాజాగా ఐఆర్‌సీటీసీకి కృత్రిమ మేధను (ఏఐ) జోడించి ఆధునీకరించింది.

ఫలితంగా ఐఆర్టీసీ వెబ్ సైట్ తోపాటు మొబైల్ యాప్ లో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి సాయంతో యూజర్లు మరింత సులువుగా రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకోగలుగుతున్నారు. ఉదాహరణకు ఐఆర్‌సీటీసీలో ఇంతకుముందు టికెట్ బుక్ చేసేటప్పుడు స్టేషన్ల వివరాలు నమోదు చేశాక రైలు పేరు మాత్రమే కనిపించేది. దానిపై క్లిక్ చేశాక తరగతిని బట్టి అందుబాటులో ఉన్న టికెట్లు, ధరలు వంటి వివరాలు వచ్చేవి. ప్రస్తుతం ఆధునీకరించిన వెబ్ సైట్ లో ప్రయాణ వివరాలను సెర్చ్ చేయగానే రైళ్లు, ఆయా తరగతుల్లో అందుబాటులో ఉన్న సీట్లు, ధరలతోపాటు ఇతర అనేక వివరాలు ప్రత్యక్షమవుతున్నాయి. టికెట్ కన్ఫర్మేషన్ కు ఉన్న అవకాశాలను కూడా అక్కడ శాతాల రూపంలో చూపిస్తుంది. ఆప్షన్ వల్ల ప్రయాణికులతోపాటు రైల్వేకు సైతం లాభం చేకూరనున్నది. ఏ మార్గంలో ఎక్కువమంది ప్రయాణికులు ప్రయాణం చేయాలనుకుంటున్నారో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దీన్ని పరిగణనలోకి తీసుకొని ఆయా మార్గాల్లో కొత్తగా మరో ప్రత్యేక రైలును నడిపేందుకు కూడా వీలవుతుంది.

అత్యాధునిక ఫీచర్లు ఇవే ఇంతకుముందు అందుబాటులో ఉన్నాయనుకొని బుక్ చేసేలోపు టికెట్లు అయిపోయాయనే సందేశం వచ్చేది. రైల్వే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. టికెట్ బుకింగ్ అయ్యాక వెయిటింగ్ లిస్టు అనే స్టేటస్ కనిపించేది. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఇలా ఎక్కువగా జరిగేది. తాజాగా ఆధునీకరించిన ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లో క్యాచీ సిస్టమ్ ను జోడించారు. దీనివల్ల ఎప్పటికప్పుడు ఎన్నిసీట్లు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. వెబ్ పేజీలను రీఫ్రెష్, రీలోడ్ చేయకుండానే సీట్ల అందుబాటు వివరాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. రైల్వే టికెట్ తోపాటే బస చేసేందుకు గదులు, హోటళ్లను బుక్ చేసుకునే అవకాశం ఉన్నది. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరిన తర్వాత వాటికోసం ప్రత్యేకంగా వెతుక్కునే శ్రమ తప్పుతుంది. తరుచూ వెళ్లే రైలు లేదా తరుచూ వెళ్లే మార్గాల్లో సులభంగా టికెట్ బుక్ చేసుకునే అవకాశం కూడా ఉన్నది. వెళ్లాల్సిన రైలుకు సంబంధించిన సమాచారం ఒక్క పేజీలోనే కనిపించేలా చేశారు సెర్చింగ్ విధానాన్ని సులభతరం చేశారు. కొత్త వెర్షన్ లో సైబర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.
టికెట్ బుకింగ్ చేసినప్పుడు వినియోగించిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు వినియోగదారుని అనుమతితోనే వెబ్ సైట్ లో సేవ్ అవుతాయి. స్మార్ట్ బుకింగ్ పైనా కసరత్తు భవిష్యత్తులో రైల్వే టికెటింగ్ లో స్మార్ట్ బుకింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు ఐఆర్‌సీటీసీ, సీఆర్ఎస్లు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మనం ప్రయాణించాల్సిన మార్గానికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుంది. అంటే.. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ వెళ్లడానికి ఉన్న అన్ని రైల్వే మార్గాలను స్మార్ట్ బుకింగ్ ఫీచర్ లో అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. 5 లక్షల మంది లాగిన్ అయినా.. ప్రస్తుతం భారత రైల్వేకు దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. రోజుకు 8 లక్షల మంది టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఇందులో 83 శాతం ఆన్ లైన్ లోనే బుక్ అవుతున్నాయి. వెబ్ సైట్, యాప్ వినియోగం భారీస్థాయిలో ఉండటంతో ఏఐని వాడుతున్నారు. ఒకేసారి 5 లక్షల మంది వినియోగదారులు ఉపయోగించినా సర్వర్ డౌన్ కాకుండా ఉంటుంది. ఈ సాంకేతికతతో చాలా వేగంగా స్పందిస్తూ బుకింగను సులభతరం చేస్తుందని రైల్వేశాఖ అధికారులు చెప్తున్నారు.

తెలంగాణ పోలీసులు నిమిషాల్లో నేరస్తులను పసిగట్టేస్తున్నారు!

ఎంతటి మహా నేరస్థులైనా ఏదో ఒక చోట తప్పుచేస్తారు. వేలిముద్రలతో చిన్న క్లూ ఇచ్చేస్తారు. ఇలా వచ్చిన ఒక్క ‘ చాన్స్’తో తెలంగాణ పోలీసులు నిమిషాల్లో నేరస్థులను పసిగట్టేస్తున్నారు. వెంటాడి పట్టేస్తున్నారు. నేర పరిశోధనలో తమదైన ‘ముద్ర’ వేస్తున్నారు. అంతర్జాతీయస్థాయి దర్యాప్తు సంస్థలు వినియోగిస్తున్న సాంకేతికత పాపిలాన్ను ఉపయోగించి వేలిముద్ర (చాన్స్ ప్రింట్)తో కరుడుగట్టిన నేరస్థులనూ కటకటాల్లోకి పంపుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పదుల సంఖ్యలో కేసులను పరిష్కరించారు. నేరం చేసినా దొరికిపోతాం’ అనుకునేలా దొంగలకు గుబులు పుట్టిస్తు న్నారు. నేరస్థులు ఎవరైనా వేలిముద్ర (చాన్స్ ప్రింట్)తో పట్టేస్తున్నారు తెలంగాణ ఫింగర్ ప్రింట్ పోలీసులు. అత్యాధునిక పాపిలాన్ సాంకేతికతతో నేరస్థులను నీడలా వెంటాడుతున్నారు. నేరం జరిగిన వెంటనే పట్టుకుని కటకటాల్లోకి పంపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల కేసుల ఛేదనలోనూ సాయం అందిస్తున్నారు.

నేరస్థులను పట్టుకోవడంలో రాష్ట్ర పోలీసులు తమదైన ముద్ర వేస్తున్నారు. నేర పరిశోధనలో దేశంలోనే తొలిసారిగా సాంకేతికత పాపిలానను జోడించారు. అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. సీఐడీలోని తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో ఆధ్వర్యంలో తీసుకొచ్చిన మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ లు, లైవ్ స్కానర్లు, ఇంటర్ స్టేట్ డాటా షేరింగ్.. చేపట్టిన ఎన్నో సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయినపల్లిలో ఇటీవల పెండ్లింట 61 తులాల బంగారం, రూ.2.80 లక్షల సొమ్ము చోరీ సంచలనం సృష్టించింది. నిందితుడు వదిలిన ఏకైక ఆధారం వేలి ముద్ర (చాన్స్ ప్రింట్). దాని ఆధారంగా నిందితుడు రాజేంద్రప్రసాద్ జాడను పోలీసులు కనిపెట్టారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీల్లో రూ. 12.45 లక్షల సొత్తు ఎత్తుకెళ్లిన పాండును వేలిముద్రల ఆధారంగానే పోలీసులు అరెస్టుచేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన షేక్ ఉస్మాన్ మంచిర్యాలలో చోరీ సొత్తు అమ్మేందుకు తిరుగుతుండగా మొబైల్ ఫింగర్ ఫ్రింట్ డివైజ్ ద్వారా పరిశీలించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాపిలాన్ అంటే..
పాపిలాన్ అనేది ఒక సాఫ్ట్ వేర్, ఫింగర్ ప్రింట్ పరిశోధనకు సంబంధించి దీన్ని వాడుతున్నారు. ఈ టెక్నాలజీ సాయంతో పాత నేరస్థుల వేలిముద్రలతో తయారుచేస్తారు. నేరస్థలిలో లభించే వేలిముద్రలను ఈ టెక్నాలజీని ఉపయోగించిన డాటాబేస్లోని నేరస్థుల ఫింగర్ ప్రింట్స్ తో పోల్చి క్షణాల్లోనే నిందితులను గుర్తిస్తున్నారు. తక్కువ సమయంలోనే నేరస్థులను అరెస్టుచేసే అవకాశం కలుగుతున్నది. అంతర్జాతీయస్థాయి దర్యాప్తు సంస్థలు సైతం ఈ టెక్నాలజీని వాడుతున్నాయి. దేశంలో తెలంగాణలోనే దీని వినియోగం మొదలైంది.
సాంకేతికతతో మంచి ఫలితాలు
అత్యాధునిక పాపిలాన్ టెక్నాలజీ వినియోగంతో రాష్ట్రంలో చాలా కేసులు త్వరితగతిన ఛేదించగల్గుతున్నాం. క్షేత్రస్థాయి సిబ్బందికి ఇచ్చిన మొబైల్ చెక్ డివైజ్ లతో అనుమానితులను రియల్ టైంలో గుర్తించ గల్గుతున్నాం. నేరాల కట్టడికి వీలు కలుగుతున్నది. చాలావరకు అంతర్రాష్ట్ర దొంగల ముఠాలకు చెక్ పెట్టగల్గుతున్నాం. సాంకేతిక విధానంలో డాటాను నిక్షిప్తం చేస్తుండటంతో భవిష్యత్తులోనూ
ఉపయోగపడుతుంది.

కుంకుమ పువ్వు ఉపయోగాలు

గర్భిణులు కుంకుమపువ్వు కలిపిన పాలు తాగితే పిల్లలు తెల్లగా పుడతారు అని అంటుంటారు. ఇది అపోహేనని కొందరు కొట్టిపారేస్తారు. ఏది నిజమో కచ్చితంగా తెలియకపోయినా రంగు, రుచి వాసనా ఉన్న అరుదైన సుగంధ ద్రవ్యమే కుంకుమపువ్వు. అందుకే అది అందరికీ ‘ప్రియమైన ఎర్ర బంగారం!

కుంకుమపువ్వు.. ఈ పేరు వినగానే కాశ్మీర్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనదేశంలో ఇది కేవలం అక్కడ మాత్రమే పండుతుంది. కానీ నిజానికి దీని స్వస్థలం దక్షిణ ఐరోపా.

అక్కడ నుంచే వివిధ దేశాలకు విస్తరించింది. గ్రీసు, స్పెయిన్ ఇరాక్, ఇటలీ, సిసిలీ, టర్కీ ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తారు. అయితే అన్నింటిలోకి కాశ్మీర్ కేసర్ నాణ్యమైనది. కుంకుమపువ్ల్వనే
ఇంగ్లీష్ లో ‘ శాఫ్రాన్ అంటారు. ‘ జాఫ్రాన్ అనే అరబిక్ పదం నుంచి ఇది ఆవిర్భవించింది. మన దేశంలో ఉత్తరాది రాష్ట్రాలంతటా దీనిని ‘కేసర్ అంటారు.

పువ్వంటే పువ్వు కాదు కుంకుమపువ్వు మొక్క చూడ్డానికి ఉల్లి లేదా ఎర్రలిల్లీ మొక్కలా ఉంటుంది. చిన్న దుంపవేరు నుంచి ఆకులు పైకి వచ్చి వాటి మధ్యలో పూలు వస్తాయి. కాశ్మీర్ లో పండించే కుంకుమపుష్వ మొక్కకి పైకి ఆకులు కూడా కనిపించవు.

కేవలం వంగపండు రంగు పువ్వు మాత్రం కనిపిస్తుంది. కాశ్మీర్ లోని పాంపోర్ ప్రాంతంలోని నేలంతా అక్టోబరు-నవంబరులో విరబూసిన కుంకుమపువ్వుతో నిండిపోతుంది. ముందు మొగ్గ వచ్చి పువ్వు విచ్చుకుంటుంది.

అదే కుంకుమపువ్వు అనుకుంటే పొరపాటే. అందులో ముచ్చటగా మూడే అండకోశాలు, రెండు కేసాలు, రెండు కేసరాలు ఉంటాయి. కిందభాగంలో పసుపు, పైన ఎరుపురంగులో ఉండే ఈ అండకోశాలనే కుంకుమపువ్వుగా పిలుస్తారు.

ఈ ఎరుపు రంగు భాగమే ఘాటైన వాసననీ, రుచినీ, రంగునీ ఇస్తుంది. ఉదయాన్నే విచ్చుకునే ఈ పూలను వెంటనే కోసి అందులోని ఎరుపురంగులో ఉండే అండకోశ భాగాలను తుంచి ఎండబెడతారు. అప్పుడే అవి మంచి వాసనతో ఉంటాయి. విచ్చు కున్న పూలను కొయ్యడంలో ఒక్కపూట ఆలస్యం చేసినా అవి వెంటనే వాడి పోతాయి.
అండకోశాలు రంగునీ, రుచినీ కోల్పోతాయి. అందుకే, పూసిన పూలన్నిటినీ ఉదయం పదిగంటలలోపే కోసేస్తారు. కిలో కుంకుమపువ్వు కావాలంటే సుమారు లక్షన్నర పూలను సేకరించాలి. అన్నింటినుంచీ అండకోశాలను చేత్తోనే వేరుచేయాలి. ఇది ఎంతో శ్రమతో కూడిన పని. శాఫ్రాన్ అంత ధర పలకడానికి ఇదీ ఓ కారణమే. మన దగ్గర గ్రాము కుంకుమపుష్వ ధర సుమారు రూ.60 నుంచి 600వరకూ ఉంటుంది.

నాణ్యతను బట్టి ధర మారుతుంది. మనిషి వాడిన మొదటి సుగంధ ద్రవ్యం ఇదేనట. సుగంధ ద్రవ్యాల్లోకెల్లా ఖరీదైనది కూడా ఇదే. ప్రాచీన రోమన్లు స్నానానికి, జుట్టుకి రంగు వేసుకునేందుకు కూడా దీన్ని ఎక్కువగా వాడేవారు. దీన్ని అంతటా వంటల్లోనే ఎక్కువగా వాడుతున్నారు.

బిర్యానీ, పాయసం, హల్వా, హల్వా, కాశ్మీరీ పలావ్- ఇలాంటివి చేయాలన్నా చిటికెడు కుంకుమపుష్వ వేస్తే ఆ రుచే వేరు. పర్షియన్, స్పెయిన్ వంటల్లో ఇది తప్పనిసరి. స్తోమత ఉండి వేయాలేగానీ, ఏ వంటలో
వేసినా దానికి ఒకలాంటి ఘాటుతో కూడిన మంచి వాసన, రంగూ, రుచీ వస్తాయి. ఈ వాసన కారణంగానే దీన్ని పరిమళ ద్రవ్యాల్లోనూ వాడుతుంటారు. అయితే ఆహార పదార్థాల్లో వాడేటప్పుడు తగు మోతాదులోనే వాడాలి. మరీ ఎక్కువ వాడితే మొదటికే మోసం. రుచి మారి చేదెక్కుతుంది.

మేను సింగారంల కుంకుమపువ్వు మంచి సౌందర్య సాధనం కూడా. అందుకే కాస్మెటిక్ క్రీముల్లోనూ దీన్ని విరివిగా వాడుతున్నారు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియాలో గుణాల వల్ల ఇది మొటిమలకు కూడా మందులా పనిచేస్తుంది.

పుత్తడితో తులతూగే కుంకుమపువ్వులో నిజంగానే బంగారంలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి. కుంకుమపువ్వులో శాఫ్రనాల్, ఇతర గాఢతైలాలు ఉండటం వల్లే, కుంకుమపువ్వుకి ఆ వాసన వస్తుంది.

ఇఫా-క్రోసిన్, జియాక్సాంథిన్, లైకోసిన్, బీటాకెరోటిన్ శా వంటి కెరోటినాయిడ్ల వల్లే వీటికా రంగు వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ల గుణాలున్న ఈ ఫైటోకెమికల్స్ అన్నీ రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అందుకే ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు.

మూత్రపిండాలు, మూత్రాశయం, కాలేయ రుగ్మతలను తగ్గిస్తుంది. రక్తశుద్ధికి తోడ్పడుతుంది. కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది. నెలసరిని క్రమబద్ధం చేస్తుంది. కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తుంది. కడుపులో నొప్పిని కూడా తగ్గిస్తుంది.

ఇది జీర్ణశక్తికి చాలా మంచిది. పేగు గోడలకు పూతలా అతుక్కుని ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు లేకుండా చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ డిఫ్రసెంట్ గానూ పనిచేస్తుంది.
పడుకునే ముందు చిటికెడు కుంకుమపువ్వుని పాలల్లో కలుపుకుని తాగి పడుకుంటే నిద్రలేమి తగ్గుతుంది. ఫలితంగా డిప్రెషన్ వంటివి కూడా
తగ్గుతాయి.

Saranga Dariya Song Lyrics in Telugu and English

Movie: Love Story

Singer: Mangli

Music: Pawan Ch

Lyrics: Suddala Ashok Teja

దాని కుడీ భుజం మీద కడవా

దాని గుత్తెపు రైకలు మెరియా

అది రమ్మంటె రాదురా సెలియా

దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా

దాని యెజెంటు రైకలు మెరియా

అది రమ్మంటె రాదురా సెలియా

దాని పేరే సారంగ దరియా

కాళ్ళకు ఎండీ గజ్జెల్… లేకున్నా నడిస్తే ఘల్ ఘల్

కొప్పులో మల్లే దండల్… లేకున్నా చెక్కిలి గిల్ గిల్

నవ్వుల లేవుర ముత్యాల్… అది నవ్వితే వస్తాయ్ మురిపాల్

నోట్లో సున్నం కాసుల్… లేకున్నా తమల పాకుల్

మునిపంటితో మునిపంటితో… మునిపంటితో నొక్కితే పెదవుల్

ఎర్రగా అయితదిర మన దిల్

చురియా చురియా చురియా… అది సుర్మా పెట్టిన చురియా

అది రమ్మంటె రాదురా సెలియా

దాని పేరే సారంగ దరియా

దాని కుడీ భుజం మీద కడవా

దాని గుత్తెపు రైకలు మెరియా

అది రమ్మంటె రాదురా సెలియా

దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా

దాని యెజెంటు రైకలు మెరియా

అది రమ్మంటె రాదురా సెలియా

దాని పేరే సారంగ దరియా

రంగేలేని నా అంగీ… జడ తాకితే అయితది నల్లంగి

మాటల ఘాటు లవంగి… మర్లపడితే అది శివంగి

తీగలు లేని సారంగి… వాయించబోతే అది ఫిరంగి

గుడియా గుడియా గుడియా… అది చిక్కీ చిక్కని చిడియా

అది రమ్మంటె రాదురా సెలియా

దాని పేరే సారంగ దరియా

దాని సెంపలు ఎన్నెల కురియా

దాని సెవులకు దుద్దులు మెరియా

అది రమ్మంటె రాదురా సెలియా

దాని పేరే సారంగ దరియా

దాని నడుం ముడతలే మెరియా

పడిపోతది మొగోళ్ళ దునియా

అది రమ్మంటె రాదురా సెలియా

దాని పేరే సారంగ దరియా

దాని కుడీ భుజం మీద కడవా

దాని గుత్తెపు రైకలు మెరియా

అది రమ్మంటె రాదురా సెలియా

దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా

దాని యెజెంటు రైకలు మెరియా

అది రమ్మంటె రాదురా సెలియా

దాని పేరే సారంగ దరియా..

Saranga Dariya Song Lyrics in English

Dani kudi bhujam meedha kadva
Dani guttepu raikulu meriya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya

Dani edam bhujam meedha kadva
Dhani yejentu raikulu meriya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya

Kaalluku vendi gajjel
Lekunna nadiste ghal ghal
Koppula malle dandal
Lekunna chekkili gil gil

Navvulo levura mutyaal
Adhi navvite vastay muripal
Notulo sunam kaasul
Lekuna thamala paakul

Muripantitho muripantitho
Muripantitho nokithe pedhavul
Earagha aithadhira manadil

Churiya churiya churiya
Adhi surma pettil churiya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya

Dani kudi bhujam meedha kadva
Dani guttepu raikulu meriya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya

Dani edam bhujam meedha kadva
Dhani yejentu raikulu meriya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya

Rangeleni naa angi
Aada taakite ayitadi nallangi
Maatala ghaatu lavangi
Marla padite adi sivangi
Teegalu leni saarangi
Vaayinchabote adi firangi

Gudiya gudiya gudiya
Adi chikki chikkani chidiya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya

Dhani sempal ennala kuriya
Dhani sevulaku duddhul meriya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya

Dani nadum mudathale meriya
Padipothadi mogola duniya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya

Dani kudi bhujam meedha kadva
Dani guttepu raikulu meriya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya

Dani edam bhujam meedha kadva
Dhani yejentu raikulu meriya
Adhi ramante radhura seliya
Dani pere saranga dariya

Oke Oka Lokam Song Lyrics In Telugu and English

Movie: Sashi (2021)
Song: Oke oka lokam
Lyrics: Chandra Bose
Music: Arun Chiluveru
Singer: Sid Sriram
Music Label: Aditya Music.

ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే
ఏక ఏకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురూ నువ్వే
ప్రాణానిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించన
నన్ను నన్నుగా అందించన
అన్ని వేళల తోడుండాన
జన్మ జన్మలా జంటవనా

ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే
ఏక ఏకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురూ నువ్వే
ప్రాణానిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించన
నన్ను నన్నుగా అందించన
అన్ని వేళల తోడుండాన
జన్మ జన్మలా జంటవనా
ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంత నీకే నేను కావలుండనా
ఓ కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంత నీకే నేను కావలుండనా
నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్ని పంచేయినా
ఎన్నాళ్లయినా గుర్తుండేటి ఆనందంలో ముంచేయనా
చిరునవ్వులే సిరమువ్వగా కట్టన

క్షణమైనా కనబడకుంటే ప్రాణ మాగదే
అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే
ఎండే నీకు తాకిందంటే చెమట నాకు పట్టెనే
చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టెనే
దేహం నీది నీ ప్రాణమీ నేనులే
ఒకే ఒక లోకం నువ్వే
లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే నాకే అందావే
ఏక ఏకీ కోపం నువ్వే
కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురూ నువ్వే
ప్రాణానిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించన
నన్ను నన్నుగా అందించన
అన్ని వేళల తోడుండాన
జన్మ జన్మలా జంటవనా

Oke Oka Lokam Song Lyrics In English

Oke oka lokame nuvve
Lokamlona andham nuvve
Andhanike hrudhayam nuvve naake andhave
Eka eki kopam nuvve
Kopam lona deepam nuvve
Deepam leni veluthuru nuvve
Prananila veliginchave
Ninnu ninnuga preminchana
Nannu nannuga andinchana
Anni velala thodundana
Janma janmala jantavana

Oke oka lokame nuvve
Lokamlona andham nuvve
Andhanike hrudhayam nuvve naake andhave
Eka eki kopam nuvve
Kopam lona deepam nuvve
Deepam leni veluthuru nuvve
Prananila veliginchave
Ninnu ninnuga preminchana
Nannu nannuga andinchana
Anni velala thodundana
Janma janmala jantavana

O kallathoti nityam ninne kougilinchana
Kalamantha neeke nenu kavalundana
Ninna monna gurthe raani santhoshanni pancheyana
Ennaliana gurthundeti anandamlo muncheyana
Chiru navvule siri muvvaga kattana

Kshanamaina kanabadakunte pranamagadhe...
Adugaina duram velithe oopiradadhe
Yenda neeku thaakindhante chemata naaku pattene
Chale ninnu cherindhante vanuku naaku puttene
deham needhe pranam nee praname nenu le
Oke oka lokame nuvve
Lokamlona andham nuvve
Andhanike hrudhayam nuvve naake andhave
Eka eki kopam nuvve
Kopam lona deepam nuvve
Deepam leni veluthuru nuvve
Prananila veliginchave
Ninnu ninnuga preminchana
Nannu nannuga andinchana
Anni velala thodundana
Janma janmala jantavana