Home Blog Page 187

శామ్‌సంగ్ కొత్త ఫ్లిప్ ఫోన్ ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి .. ఈసారి రూ .70 వేల రేంజ్‌లో!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శామ్‌సంగ్ తన కొత్త సెల్‌ఫోన్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సెల్‌ఫోన్ ధర, స్పెక్స్ మరియు లాంచ్ డేట్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర, స్పెక్స్ మరియు లాంచ్ డేట్ స్మాల్ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ టెలిఫోన్ ఆగస్టు ఆరంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అందిన నివేదిక ప్రకారం, సెల్‌ఫోన్‌కు అదనంగా 15W త్వరగా ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇది అదనంగా ఎస్ పెన్ స్టైలస్ సపోర్ట్‌తో వస్తుంది. అయితే ఏజెన్సీ ఇప్పుడు ఈ ఫోన్ గురించి నమ్మదగిన రికార్డులను ప్రవేశపెట్టలేదు.

శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర (అంచనా)
ఫ్రంట్‌ట్రాన్ అని పిలువబడే ప్రసిద్ధ టిప్‌స్టార్ ట్వీట్ ద్వారా ఛార్జీని లీక్ చేశారు. దీని ధర $ 999 (సుమారు రూ. 73,000) మరియు $ 1,099 (సుమారు రూ .80,700) మధ్య ఉండే అవకాశం ఉంది. హై-ఎండ్ వేరియంట్ ధర $ 1,199 (సుమారు రూ. 88,000).

ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు నెలలో విడుదల చేయనున్నట్లు పుకారు ఉంది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ తదుపరి మోడల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 2020 లో విడుదల చేయనున్నారు.

సెల్‌ఫోన్ అదనంగా చైనీస్ సర్టిఫికేషన్ ఇంటర్నెట్ సైట్ 3 సిలో కనిపించింది. ఈ ధృవీకరణ జాబితా ప్రకారం ఇది 15W వరకు త్వరగా ఛార్జింగ్ చేయడానికి సహాయపడుతుంది. ఇది అదనంగా సహాయపడే వేగవంతమైన ఛార్జర్‌తో వస్తుంది. దీనితో EP-TA200 ఛార్జర్‌ను ఇవ్వడం సాధ్యమే. బొమ్మ పరిమాణంతో ఉన్న ఈ టెలిఫోన్ ఈ జాబితాలో ఉంది.

లెట్జ్‌గో డిజిటల్ కథనం ప్రకారం, శామ్‌సంగ్ ఎస్ పెన్ మద్దతుతో టెలిఫోన్ ప్రారంభించబడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రేడ్‌మార్క్ కోసం శామ్‌సంగ్ మే 6 న యూరోపియన్ మేధో సంపత్తి కార్యాలయంలో ఉపయోగించబడింది.

ఆరోగ్యం కోసం బెల్లం మధురౌషధం

ప్రకృతి సంపదను ఆరోగ్యం కోసం ఆహారంగా, ఔషధాలుగా మలచుకోవడం ఆయుర్వేద శాస్త్ర విశిష్టత. ఆరు రుచులలోనూ (తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు) మధుర రసానిదే అగ్రస్థానం. కొన్ని పదార్థాలు నాలుకకు తగలగానే తీపి స్ఫురిస్తుంది. కొన్నింటిలో తీపి అంతర్లీనంగా అనురసంగా ఉంటుంది. వివిధ ఫలాలు, దుంప జాతులు, కొబ్బరి నీళ్ల వంటి ద్రవ్యాలలోని మాధుర్యం అందరికీ తెలిసినదే. బయటకు గట్టిగా కర్రలా ఉన్నా, చెరకులో నిండుగా తీపి ఉంటుంది. చెరకును సంస్కృతంలో ఇక్షు అంటారు.

మన దేశంలో చాలాకాలంగా ఇక్షు రసం నుంచి బెల్లం (గుడం) తయారుచేస్తున్నారు. ఔషధాల తయారీలో, వంటకాలలో బెల్లాన్ని ఉపయోగిస్తారు. సితా (పటిక బెల్లం), ఖండ శర్కర (ఇసుకలా అతి సన్నగా ఉన్న పంచదార), మధు శర్కర (తేనె నుంచి తయారైన పంచదార)… ద్రవ్యాల ప్రయోజనాల గురించి భావప్రకాశ సంహితలో కనిపిస్తుంది. కాని వీటి తయారీ గురించి కనపడదు. ఈనాడు రసాయనిక పదార్థాలతో తయారుచేస్తున్న పంచదారకు, నాటి సహజ సిద్ధమైన శర్కరలకు చాలా తేడా ఉంది. బెల్లం అమోఘమైన పోషకాహారం.

చెరకు బెల్లం – సశాస్త్రీయ వివరాలు

చెరకు రసం: శరీరానికి చలవ చేస్తుంది. వీర్యవర్థకం, కఫకరం. కాచిన చెరకు రసం శరీరం లో వేడిని ఉత్పత్తి చేస్తుంది. కడుపులోని వాయువుని, కడుపు నొప్పిని పోగొడుతుంది. నిల్వ చేయటం వలన పులిసిన చెరకు రసం మంచిది కాదు (కొన్ని గంటలపాటు పులిస్తే పరవాలేదు). మలమూత్రాలను సాఫీగా జారీ చేస్తుంది. గుణాలు: తియ్యగా, జిగురు (స్నిగ్ధం) గా ఉంటుంది. వాతహరం. కొంతవరకు వేడిని తగ్గిస్తుంది, కాని శర్కరంత చలవ చేయదు. మూత్రాన్ని సాఫీగా చేసి మూత్ర వికారాలను తగ్గిస్తుంది. వృష్యం (శుక్రకరం, వీర్యవర్థకం), బలవర్థకం. దేహంలో కొవ్వును (మేదస్సు) పెంచుతుంది. కఫాన్ని, క్రిములను పెంచుతుంది. (ఇక్షా రసో యస్సపక్వో జాయతే… సగుడా… వృష్యా గురు: స్నిగ్ధ వాతఘ్నో మూత్ర శోధనః’ నాతి పిత్త హరో మేదః కఫ కృమి బలప్రదః)

కొత్త బెల్లం: జఠరాగ్నిని పెంచుతుంది, కాని కఫాన్ని, కృములను కలుగచేస్తుంది. దగ్గు, ఆయాసాల ను పెంచుతుంది. (గుడో నవః కఫ శ్వాస కాస కృమి కరో అగ్నికృత్)

పాత బెల్లం: చాలా మంచిది (పథ్యం), లఘువు అంటే తేలికగా జీర్ణమై శరీరాన్ని తేలికపరుస్తుంది. వేడిని తగ్గించి కొవ్వును కరిగిస్తుంది. జఠరాగ్నిని పెంచి, పుష్టిని కలిగిస్తుంది. వృష్యం. రక్తదోషాన్ని పోగొడుతుంది. వాతరోగాల్ని తగ్గిస్తుంది. గుడో జీర్ణ లఘుః పథ్యో న అభిష్యంది అగ్ని పుష్టికృత్ పిత్తఘ్నో మధురో వృష్యా వాతఘ్నో అస్పక్ ప్రసాదనః

ఔషధ గుణాలు: బెల్లాన్ని శుంఠి (శొంఠి)తో కలిపి సేవిస్తే, అన్నిరకాల వాతరోగాలు తగ్గుతాయి. అల్లంతో కలిపి సేవిస్తే కఫవ్యాధులు పోతాయి. కరక్కాయ చూర్ణంతో కలిపి సేవిస్తే, అన్ని పిత్త రోగాలు ఉపశమిస్తాయి. ఇది మూలవ్యాధి (పైల్స్)ని తగ్గించడానికి మంచి మందు.

మత్స్యండీ: చెరకు రసాన్ని ఒక పద్ధతిలో వేడి చేస్తూ బెల్లాన్ని తయారుచేసేటప్పుడు, చివరన కొంచెం ద్రవాంశలు మిగిలిపోతాయి. దానినే మత్స్యండీ అంటారు. ఇది బలకరం, మృదురేచకం, రక్తశోధకు, వీర్యవర్ధకం. (మత్స్యండీ భేదినీ, బల్యా, బృంహణీ వృష్యా, రక్తదోషాపహాః స్మృతా)

ఆధునిక జీవరసాయన పోషక వివరాలు:

తాటి బెల్లం, ఖర్జూర బెల్లం, కొబ్బరి బెల్లాలు కూడా తయారీలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం చెరకు ల్లాన్నే ఎక్కువ వాడుతున్నారు. దీనిలోని పోషకల విలువలు కూడా విశిష్టం. నూరు గ్రాముల బెల్లంలో ప్రొటీన్లు 0, 4, కొవ్వులు 0, 1, మినరల్స్ 0.6 శర్కరలు (కార్బోహైడ్రేట్స్) 95 శాతం, కాల్షియం 80 శాతం, ఫాస్ఫరస్ 40 శాతం, ఐరన్ 2.64, కేలరీలు 383 ఉంటాయి.

తయారీలో- ఆసక్తికర అంశాలు:

రిఫైన్డ్, డిస్టిలేషన్ చేయకుండా ఉన్నది. మంచి బెల్లం. దీంట్లో కెమికల్స్ వాడకపోవటం వలన అన్ని పోషక ఖనిజాలు (ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్) భద్రంగా ఉంటాయి. మట్టిరంగు వంటి నలుపు రంగులో ఉండే బెల్లం ఉత్తమం. దీంట్లో విటమిన్లు, ఫైబర్ కూడా ఉంటాయి. కనుక ఆరోగ్యకరం. ఆర్గానిక్ బెల్లం (జాగరీ): ఇది మరింత శ్రేష్ఠం. చెరకును పండించినపుడు కృత్రిమ రసాయనిక ఎరువులు గాని, క్రిమిసంహారక మందులు గాని వాడరు. బెల్లంలో తెలుపు లేదా ఎరుపు రంగు రావటం కోసం కెమికల్స్ (బేకింగ్ సోడా, కాల్షియం కార్బొనేట్/సున్నం పొడి, జింక్ ఫార్మాల్ డిహైడ్ సల్ఫాక్సిలేటు వంటివి) వాడరు. కనుక పసుపు మిశ్రిత మట్టిరంగులో చూర్ణం రూపంలో ఉంటుంది. సుక్రోజ్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. పొటాషియం, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు వార్ధక్యాన్ని దూరం చేయటానికి ఉపకరిస్తాయి.

కల్తీ బెల్లాలు: నిగనిగలాడే ఎరుపు, తెలుపు, పసుపు రంగులు విరజిమ్మటం కోసం హానికర కెమికల్స్, తీపిని అధికం చేసే కెమికల్స్, నిల్వ ఉండటానికి కెమికల్స్ అధిక మోతాదులో కలుపుతారు. అసలైన మట్టిరంగు కంటె ఈ ఆకర్షిత రంగు బెల్లానికి వినియోగదారులు ఆకర్షితులవుతారు. పంచదార తయారీలో మితిమీరిన తెలుపు, తీపి మినహా పోషక విలువలు ఉండవు. బ్రౌన్ సుగర్ లో బ్లీచింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు నయం. తెల్లటి పంచదార తయారీ లో రసాయనిక పదార్థాలు అధికంగా ఉంటాయి. ఆ పంచదార ఆరోగ్యానికి చేటు చేస్తుంది కనుక జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

ఉప్పు అతిగా తినడం ముప్పు…

ఉప్పుని శరీరానికి హితశత్రువు అనుకోవచ్చు. వంటకానికి రుచి తెప్పించి, నాలుకని ఆకర్షించి, మనిషిని తనకు బానిసగా మార్చేసుకుంటుంది ఉప్పు. ఉప్పుని సోడియం క్లోరైడ్ అంటారు. మానవ శరీరం అసంఖ్యాక కణజాల నిర్మితం. కణం లోపల ఉండే పొటాషియానికి, కణం బయట ఉండే సోడియానికి ఉండే పరిమాణ నిష్పత్తి 8:1బీ ఇది సృష్టి ధర్మం. ప్రకృతి దత్తమైన ఆహార పదార్థాలు అపక్వంగా ఉన్నప్పుడు వాటిలో ఉండే పొటాషియం, సోడియముల నిష్పత్తి దాదాపు 8:1 గానే ఉంటుంది. మన ఆహార సేవన లో ఈ రెంటి నిష్పత్తిని ఇలాగే కాపాడుకోవాలి. మనం వంట వండే విధానం స్వతస్సిద్ధమైన పరిమాణాలు తారుమారవుతాయి. అంటే పొటాషియం తగ్గిపోయి, సోడియం గణనీయంగా పెరిగిపోవటం. ఇది ప్రమాదకరం. లవణాన్ని ఎక్కువ తినకూడదని ఆయుర్వేదం చెప్పింది. చరక సంహిత విమానస్థానంలో, “అధ ఖలు త్రీణి ద్రవ్యాణి న అతి ఉపయుంజీతాధికం… పిప్పలీ క్షారం లవణమితి’ అంటే పిప్పళ్లు, క్షారం (కొన్ని ద్రవ్యాల నుండి వెలికి తీసిన గాఢమైన సారం), ఉప్పు ఎక్కువ తినవద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ఒక వ్యక్తికి రోజుకి 3 – 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. (బయట కొన్న ఉప్పు, ప్రకృతి ద్రవ్యాలైన పళ్లు, ఆకు కూరలు, శాకాలు, పాలు మొదలైనవి కలిపి). కాని మనం రోజుకి 20 గ్రాములు సేవిస్తున్నాం. ఇలా తినడం అనేక రోగాలకు దారి తీస్తుంది. పరిమిత పరిమాణంలో… సంహితలో: లవణం స్తంభ సంఘాత బంధ విధ్మాపనో అగ్ని కృతి స్వేహనః స్వేదనః తీక్షణి రోచనః ఛేద భేద కృత్ రుచిని పెంచుతుంది. జీర్ణక్రియ త్వరగా జరుగు తుంది. శరీరంలో కొవ్వును, కంతులను కరిగించి జడత్వాన్ని పోగొడుతుంది. స్వేదాన్ని కలిగిస్తుంది.

అతిగా సేవిస్తే అనర్థాలు
రక్తస్రావం, దప్పిక పెరుగుతాయి. బలం నశిస్తుంది. విషతుల్యం. సంధులలో వాపు పుడుతుంది. జుత్తు నెరుస్తుంది. బట్టతల, చర్మంలో ముడతలు, ఇతర చర్మ వికారాలు కలుగుతాయి.

సోతియుక్తో అస్రపవనం ఖలితం పలితం పలిమ్ తృట్ కుష్ఠ విషవిసర్పాన్ జనయేత్ క్షపయేత్ బలమ్. శరీరంలో నీటిని నిల్వ ఉండేట్టు చేసి, ఊబకాయం, వాపులు కలుగచేస్తుంది. రక్తనాళాల లోపలి పొరను గట్టిపరచి, రక్త ప్రసరణకు అవరోధం కలిగిస్తుంది. తద్వారా బీపీ పెరిగి.. పక్షవాతం, హార్ట్ ఎటాక్, కీళ్లవాపులు వంటి వ్యాధులకు దారి తీస్తుంది. నేటి జీవనశైలి వలన ఈ వ్యాధులు కలగడానికి మరింత దోహదం చేస్తుంది. మన రక్తంలోని గ్లూకోజ్.. కణాలలోనికి ప్రవేశించినప్పుడే శక్తి లభిస్తుంది. కణం యొక్క పొరను దాటి గ్లూకోజ్ లోపలకి వెళ్లాలంటే ఇన్సులిన్ హార్మోను అవసరం. అక్కడ ఇన్సులిన్ సక్రమంగా పనిచెయ్యాలంటే ఉప్పు తక్కువ స్థాయిలో ఉండా లి. అందువల్లే మధుమేహ రోగులు ఉప్పు తక్కువ తినాలి. ఇటీవలి కాలంలో జపాన్ శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.


ఐదు రకాల లవణాలు
సాముద్ర లవణం (90 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది), ఔద్భిజ లేక రోమ లవణం (70 శాతం n. సైంధవ లవణం (టౌఛిజు ట: 70% 4) బిడాల లవణం (కరక్కాయ, ఉసిరికాయ వంటి కొన్ని ద్రవ్యాల సారాన్ని తీసి, ప్రత్యేకంగా తయారుచేస్తారు. 40% N) సౌవర్చ లవణం (భూమిలోని లోపలి పొరలు, నదీ తీర ప్రాంతాలు దీనికి మూలాధారం. 30% N)

తప్పించుకోవడం ఎలా?
నిషిద్ధం: ఊరగాయలు, నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు వంటివి, ఉప్పు కారం చల్లిన వేపడాలు, డీప్ ఫైలు మానేయాలి. ఉడికించిన కూరలలో నామ మాత్రం ఉప్పు అలవరచుకోవాలి. జంక్, ఫాస్ట్ ఫుడ్స్ జోలికి పోకూడదు. బజారులో ఉప్పు కొనడం తగ్గించాలి.


సేవించవలసినవి
ఫలాలు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పాలు, బీట్ రూట్, ముల్లంగి, ఆకు కూరలు, గ్రీన్ సలాడ్సు మొదలైనవి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, చెరకురసం వంటివి. కాయగూరలు, పండ్లు మొలే నవి పెస్టిసైడ్స్, కార్బైడ్స్ యొక్క విష ప్రభావాలకు గురైనవే మనకు లభిస్తున్నాయి. ఆ విషాల్ని కొంతవరకు నాశనం చేయాలంటే… గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాలు ఉప్పు, ఒక చెంచా నిమ్మరసం వేసి అందులో కాయగూరల్ని కాని, పళ్లని కాని ఓ అరగంట నానబెట్టి, అనంతరం మంచినీటితో రెండు మూడు సార్లు కడుక్కోవాలి.

భారత ప్రభుత్వానికి చెందిన మినీరత్న కంపెనీ నార్తరన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సిఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన డాక్టర్ పోస్టుకు దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 56
పోస్ట్ వివరాలు: జిడిఎంఓ -45, స్పెషలిస్ట్-డాక్టర్స్ -11.
GDMO అర్హత: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా / స్టేట్ మెడికల్ కౌన్సిల్ అక్రెడిటెడ్ ఇన్స్టిట్యూట్ / కాలేజీలో MBBS మించి ఉండాలి.

స్పెషలిస్ట్ వైద్యులు:
విభాగాలు: మత్తుమందు – 03, మెడిసిన్ – 05, సర్జన్ – 03.
అర్హత: ఎంబిబిఎస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా మరియు అనుబంధ స్పెషలైజేషన్లు. మూడేళ్ల ప్రచురణ అర్హత ఉండాలి.

ఎంపిక విధానం: ఎంపిక ప్రధానంగా ప్రైవేట్ ఇంటర్వ్యూ (వీడియో కాన్ఫరెన్స్) ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఎలక్ట్రానిక్ మెయిల్ / ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. యుటిలిటీని జనరల్ మేనేజర్ (పర్సనల్), ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం, ఎన్‌సిఎల్ ప్రధాన కార్యాలయం, సింగారౌలి, కలరా జిల్లా, సింగారౌలి, 486889 కు పంపించాలి.
ఇమెయిల్: [email protected]

దరఖాస్తులకు చివరి తేదీ: 15.05.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nclcil.in

Maguva Maguva Songs Telugu Lyrics from Vakeel Saab Movie

Song Name: Maguva Maguva Song From Vakeel Saab

Album/Movie: Vakeel Saab

Singer(s): Sid Sriram

Music Director(s): Thaman

Record Label: Aditya Music

పల్లవి
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..

అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయట…
అలుపని రవ్వంత అననే అనవంట…

వెలుగులు పూస్తావు వెళ్లే దారంత…
స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ.ప.గ.స…

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా..
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా..

చరణం
నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా…
నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా…
ప్రతి వరసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమా అంచనాలకందునా…
ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా…
నీదగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక మగవాడు పసివాడేగా…
ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా…

స.. గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ.స… గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ… గ.మ.ప.మ.గ.స…

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా…
మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా…

Maguva Maguva, Lokaniki Telusa Nee Viluva,
Maguva Maguva, Nee Sahananiki Sarihaddhulu Kalava,

Atu Itu Anninta Nuve Jagamantha,
Parugulu Theesthavu Inta Bayata,

Alupani Ravantha Anane Anavanta,
Velugulu Pusthavu Velle Dharantha,

Maguva Maguva, Lokaniki Telusa Nee Viluva,
Maguva Maguva, Nee Sahananiki Sarihaddhulu Kalava.

Nee Katuka Kanulu Vipparakapothe,
Ee Bhumiki Thelavaradhuga,

Nee Gajula Cheyi Kadhaladakapothey,
Ye Manugada Konasagadhuga,

Prathi Varusaloni Premaga, Allukunna Bandhama,
Anthuleni Nee Shrama, Anchanalakandhuna,

Alayalu Korani, Adishakthi Roopama,
Neevu Leni Jagathi Lo Deepame Veluguna,

Needhagu Lalanalo Priyamagu Palanalo,
Prathi Oka Magavadu Pasivadega,

Endhari Pedhavulaloo Ye Chirunavunna,
Aa Siri Perupulaku Moolam Nuvega,

Maguva Maguva, Lokaniki Telusa Nee Viluva,
Maguva Maguva, Nee Sahananiki Sarihaddhulu Kalava.