Home Blog Page 188

ఆడపిల్ల పుడితే అ గ్రామంలో పండగే!

ఆడపిల్ల పుట్టిందా.. అయ్యో.. అనడం విన్నాం. అబ్బాయి పుట్టాడని సంబరాలు చేసుకోవడమూ చూశాం. కానీ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హరిదాపూర్ లో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఆ గ్రామంలో ఆడపిల్ల పుడితే ఊరుమ్మడిగా సంబంరాలు చేస్తారు.

ఆమెకు ఆత్మీయ స్వాగతం పలుకుతారు. వారి ఆర్థిక అవసరాలకు కావాల్సిన బరోసాను కూడా ఇచ్చేస్తారు. వారు ఇదంతా ఎందుకు చేస్తు న్నారు. దీని వెనుక స్ఫూర్తిదాయకమైన కారణముంది. కొండాపూర్ మండలంలోని చిన్న పల్లెటూరు పరిదాపూర్. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దాలని స్థానికులు నడుంబిగించారు.

గతేడాది సెప్టెంబరు నుంచి ఊరంతా ఏకమై శ్రమదానాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక అధికారులు కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే విషయమై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇంటింటికీ వెళ్లారు.

అలా ఒకరి ఇంటికి వెళుతుండగా ఆశా కార్యకర్త ఒకరు వద్దని వారించారు. ఎందుకు అని మిగతావారు అడిగితే.. ఇంట్లో ఇల్లాలికి మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టింది. వాళ్లు బాధలో ఉన్నారని చెప్పింది. ఈ సమాధానంతో అందరూ ఆలోచనలో పడ్డారు. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు. ఎందుకు మరి వాళు పుట్టారని ఇలా విచారణ.

ఈ పరిస్థితిలో మార్పు తేవాలని సర్పంచ్ తోపాటు పంచాయితీ కార్యదర్శి, గ్రామంలోని యువకులు గట్టిగా నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి గ్రామంలో ఆడపిల్ల పుడితే పంచాయతీ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు.

పుట్టిన ప్రతి ఆడపిల్లకూ సుకన్య సమృద్ధి యోజన పథకంలో లబ్ది చేకూరేలా చూస్తున్నారు. ఇందుకోసం తొలి నాలుగు నెలలూ పంచాయతీ నుంచి నెలకు రూ. 250 చొప్పున చెల్లిస్తున్నారు. ఆ తర్వాత నెలల్లో పిల్లల తల్లి దండ్రులు డబ్బులు జమ చేసేలా చూస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు. వారి పేర్లతో ఖాతాలు తెరిచి సుకన్య సమృద్ధి యోజన పథకం కింద వారి పేర్లను నమోదు చేయించారు. ‘ఆడపిల్లలు బారం కాదు.. అవకాశాలు కల్పిస్తే వారే మన భవిష్యత్తును మార్చగలరు అనే సందేశాన్ని ఈ ఊర్లోని ప్రతి ఇంటికి చేర్చుతున్నారు. ఇందులో గ్రామస్తులందరూ చొరవ తీసుకుంటున్నారు.
దీంతో ప్రజల వైఖరిలోనూ మార్పు కనిపిస్తోంది. హరిదాస్ పూర్ లో పదేళ్లలోపు బాలికలు 45 మంది వరకూ ఉన్నారు. వీరి సమాచారాన్ని కూడా తీసుకుని వీరందరికీ మంచి భవిష్యత్తు, ప్రభుత్వ లబ్ధి అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నాకు అంతకుముందు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు. మూడో కాన్పులోనైనా అబ్బాయి పుడతాడని ఆశపడ్డాం. కానీ మూడోసారీ ఆడపిల్లే పుట్టింది. ఇంట్లో అందరమూ చాలా బాధపడ్డాం. ఇంతలోమా ఊరి వాళ్లంతా కలిసి ఇంటికొచ్చారు. ఆలోచించడం తప్పని చెప్పారు. మా పాప పుట్టిన మూడో రోజున పంచాయతీ కార్యాలయాన్ని దీపాలతో అలంకరించి ఉత్సాహంగా వేడుక చేశారు.

ఇప్పుడునాకు ముగ్గురూ ఆడపిల్లలే అనే బాధ లేదు. సమాజంలో ఉన్న అవకాశాలను వినియోగించుకుని నా బిడ్డలను గొప్ప చదువుల చదివిస్తానంటూ సంతోషంగా చెబుతోంది సత్యవతి అనే మహిళ.

ఆన్లైన్ చదువులు భలే డిమాండ్

విద్యా సముపార్జనకు సాంకేతికత దన్నుగా నిలుస్తోంది. భయానక కరోనా పరిస్థితులు విద్యార్థుల భవిష్యత్ పై ప్రభావం చూపినా ఆన్లైన్ విద్య అండగా మారుతోంది. పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న వారికీ చేదోడు వాదోడుగా నిలుస్తోంది. సుశిక్షితులైన ట్రైనర్లు ఆన్లైన్లో కోచింగ్ ఇస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపు పడింది. అకాడమిక్ క్లాసులు వింటూనే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. భవిష్యత్ లో ఉద్యోగాలను దక్కించు కోవడానికి కావాల్సిన నైపుణ్యాలను అందిపుచ్చుకుంటు న్నారు. కరోనాతో నేరుగా శిక్షణ సంస్థలకు వెళ్లి చదువుకోలేకపోతున్న వారికి ఇప్పుడు ఆన్లైనే సరైన వేదికగా మారింది.

ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులను తమ వైపు తిప్పుకుంటూ మెప్పిస్తున్నారు ఆన్లైన్ మాస్టార్లు, ఫీజులు నామమాత్రంగానే ఉండటంతో చాలా మంది ఆన్లైన్ కోర్సుల బాట పడుతున్నారు. ఆమె పేరు ప్రతీక. సివిల్ కు సన్నద్ధమవుతోంది. కరోనా రక్కసి లేకపోతే ఈ సమయానికి ఢిల్లీలోని ఓ ప్రముఖ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటూ ఉండేది. అయితే ఆమె లక్ష్యానికి కొవిడ్ పరిస్థితులు అడ్డుగా మారాయి. దీంతో ఎలాగైనా గోల్ రీచ్ కావాలనే సంకల్పంతో ఆమె ఆన్లైన్ శిక్షణను ఎంచుకుంది. ఇంట్లోనే తరగతులు వింటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. అతడి పేరు రవీంద్ర. ఇంటర్ పూర్తి చేశాడు. డిజైనింగ్ కోర్సు చదవాలని ఆసక్తి, ఇందుకు తగ్గట్టు ప్రిపేర్ అయి ఎం ట్రైన్స్ ఎగ్జామ్ రాశాడు. గుజరాత్ లోని ఓ యూనివర్సిటీలో సీటు వచ్చింది. కానీ కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా అంతదూరం పంపించడానికి అతడి తల్లిదండ్రులు విముఖత చూపారు. దీంతో నగరంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యి ఆన్లైన్లో డిజైనింగ్ కోర్సు చేస్తున్నాడు.

ఆన్లైన్ లో సాంకేతిక కోర్సుకు డిమాండ్

కొవిడ్ పరిస్థితులతో ప్రతిఒక్కరూ ఆన్లైన్ క్లాసులకు షిఫ్ట్ అయ్యారు. ఆన్లైన్ విద్యతో ఎంతో సమయం కలిసివస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ (ఆర్టిఫిషియ్ ఇంటలిజెన్స్) కోర్సును నేర్చుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అనేక విద్యా సంస్థలు ఏఐని అకాడమిక్ లో చేరుస్తున్నాయి. సాధారణంగా ఏఐ దూరం వచ్చేది. ఆ లైన్ ద్వారా నేర్చుకుంటే మాత్రం తక్కువగానే ఉన్నాయి.

టెక్నాలజీ కోర్సుల జోరు.

పోటీ పరీక్షలతో పాటు భవిష్యత్ అవసరాలను తీర్చే సాంకేతిక ప్రాజెక్టులకు కూడా ఆన్ లైన్ లో డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ జ్ఞానం తప్పనిసరిగా చేశాయి. చాలా వరకు సాంకేతిక ఆధారంగానే కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. భౌతిక పాటించడం, టెంపరేచర్ చెకప్, మాస్క్ ధరించారా? లేదా? ఆటోమెటిక్ డోర్స్ ఓపెన్, శానిటైజింగ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగానే రూపొందించారు. మరోవైపు కోడింగ్ కోర్సుకు కూడా మార్కెట్లో డిమాండ్ ఉంది. అలానే సైబర్ సెక్యూరిటీని ఔత్సాహికులు ఆన్లైన్ లోనే అభ్యసిస్తున్నారు. కీలకమైన టెక్నాలజీ కోర్సులు ఆన్లైన్లో రూ.5 వేల నుంచి అందుబాటులో ఉండటంతో ఔత్సాహికులు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఇంట్లోనే చదువులు.

ప్రస్తుతం ఆన్‌లైన్ స్టడీ ట్రెండ్ కొనసాగుతుంది. ఏ ఇంట్లో చూసినా ఆన్లైన్ చదువులే. జూమ్, స్కైప్, యూట్యూబ్ తదితర యాల్లో పాఠాలు వింటున్నారు. 2020 జీరో ఇయర్ నిరోధానికి ప్రత్యామ్నాయంగా ఆన్ లైన్ స్టడీ విధానాన్ని ఎంచుకుంటున్నారు. సమయం వృథా చేసుకోకుండా గ్రూప్స్, సివిల్స్, టెక్నాలజీ తదితర వాటికి సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం పోటీ పరీకలకు సనదమయ్యే సంఖ్య పెరుగుతుంది. కరోనాకు ముందు ధిలసుఖనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న ఇనిస్టిట్యూట్స్ విద్యార్థులతో కళకళలాడేవి. అయితే కొవిడ్ ప్రభావంతో సంస్థలన్నీ ఆన్ లైన్ బాట పట్టాయి. సుశిక్షితులైన సిబ్బందితో పాఠాలు చెప్పిస్తున్నాయి. సమయం వృథా కాకపోవడం.. ఫీజులు అందుబాటులో ఉండటంతో అభ్యర్థులు ఆన్ లైన్ విద్యకే జై కొడుతున్నారు.

స్కిల్స్ లేకపోవడంతోనే నిరుద్యోగం

ఆన్ లైన్లో కోడింగ్ పై శిక్షణ ఇచ్చే సంస్థలు అనేకం ఉన్నాయి. కొవిడ్ సమయంలో ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న విద్యార్థులు, నిరుద్యోగులు కోడింగ్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. శిక్షణా సంస్థల కోసం ఆన్లైన్లో శోధిస్తున్నారు. మందికి స్కిల్స్ లేకపోవడంతోనే నిరుద్యోగులుగా మారుతున్నారు. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటే భవిష్యత్ ఫలాలు అందుకోగలుగుతాం.

ఆన్లైన్ విద్యతో సమయం ఆదా

ఆన్లైన్లో సివిలకు ప్రిపేర్ అవుతున్నా. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చదువుకుంటున్నా. ప్రస్తుతం కరోనా పరిస్థితుల మూలంగా ఆన్లైన్ తరగతులే బెటర్. గతంలో ఒక క్లాస్ మిస్పైతే స్నేహితుల వద్ద నోట్స్ తీసుకొని రాసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆన్లైన్ క్లాసులను రికార్డు చేసుకునే వీలుంది. ఆన్లైన్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తక్కువగానే ఫీజులు తీసుకుంటున్నాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తూ ఆన్‌లైన్‌లో చదువుకుంటున్నా.

ఆడపిల్ల పుడితే అ గ్రామంలో పండగే!

ఆడపిల్ల పుట్టిందా.. అయ్యో.. అనడం విన్నాం. అబ్బాయి పుట్టాడని సంబరాలు చేసుకోవడమూ చూశాం. కానీ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హరిదాపూర్ లో పరిస్థితి వేరుగా ఉంటుంది. ఆ గ్రామంలో ఆడపిల్ల పుడితే ఊరుమ్మడిగా సంబంరాలు చేస్తారు.

ఆమెకు ఆత్మీయ స్వాగతం పలుకుతారు. వారి ఆర్థిక అవసరాలకు కావాల్సిన బరోసాను కూడా ఇచ్చేస్తారు. వారు ఇదంతా ఎందుకు చేస్తు న్నారు. దీని వెనుక స్ఫూర్తిదాయకమైన కారణముంది. కొండాపూర్ మండలంలోని చిన్న పల్లెటూరు పరిదాపూర్. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దాలని స్థానికులు నడుంబిగించారు.

గతేడాది సెప్టెంబరు నుంచి ఊరంతా ఏకమై శ్రమదానాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక అధికారులు కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే విషయమై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇంటింటికీ వెళ్లారు.

అలా ఒకరి ఇంటికి వెళుతుండగా ఆశా కార్యకర్త ఒకరు వద్దని వారించారు. ఎందుకు అని మిగతావారు అడిగితే.. ఇంట్లో ఇల్లాలికి మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టింది. వాళ్లు బాధలో ఉన్నారని చెప్పింది. ఈ సమాధానంతో అందరూ ఆలోచనలో పడ్డారు. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు. ఎందుకు మరి వాళు పుట్టారని ఇలా విచారణ.

ఈ పరిస్థితిలో మార్పు తేవాలని సర్పంచ్ తోపాటు పంచాయితీ కార్యదర్శి, గ్రామంలోని యువకులు గట్టిగా నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి గ్రామంలో ఆడపిల్ల పుడితే పంచాయతీ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు.

పుట్టిన ప్రతి ఆడపిల్లకూ సుకన్య సమృద్ధి యోజన పథకంలో లబ్ది చేకూరేలా చూస్తున్నారు. ఇందుకోసం తొలి నాలుగు నెలలూ పంచాయతీ నుంచి నెలకు రూ. 250 చొప్పున చెల్లిస్తున్నారు. ఆ తర్వాత నెలల్లో పిల్లల తల్లి దండ్రులు డబ్బులు జమ చేసేలా చూస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు. వారి పేర్లతో ఖాతాలు తెరిచి సుకన్య సమృద్ధి యోజన పథకం కింద వారి పేర్లను నమోదు చేయించారు. ‘ఆడపిల్లలు బారం కాదు. అవకాశాలు కల్పిస్తే వారే మన భవిష్యత్తును మార్చగలరు అనే సందేశాన్ని ఈ ఊర్లోని ప్రతి ఇంటికి చేర్చుతున్నారు. ఇందులో గ్రామస్తులందరూ చొరవ తీసుకుంటున్నారు.


దీంతో ప్రజల వైఖరిలోనూ మార్పు కనిపిస్తోంది. హరిదాస్ పూర్ లో పదేళ్లలోపు బాలికలు 45 మంది వరకూ ఉన్నారు. వీరి సమాచారాన్ని కూడా తీసుకుని వీరందరికీ మంచి భవిష్యత్తు, ప్రభుత్వ లబ్ధి అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నాకు అంతకుముందు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు. మూడో కాన్పులోనైనా అబ్బాయి పుడతాడని ఆశపడ్డాం. కానీ మూడోసారీ ఆడపిల్లే పుట్టింది. ఇంట్లో అందరమూ చాలా బాధపడ్డాం. ఇంతలోమా ఊరి వాళ్లంతా కలిసి ఇంటికొచ్చారు. ఇలా ఆలోచించడం తప్పని చెప్పారు. మా పాప పుట్టిన మూడో రోజున పంచాయతీ కార్యాలయాన్ని దీపాలతో అలంకరించి ఉత్సాహంగా వేడుక చేశారు.

ఇప్పుడునాకు ముగ్గురూ ఆడపిల్లలే అనే బాధ లేదు. సమాజంలో ఉన్న అవకాశాలను వినియోగించుకుని నా బిడ్డలను గొప్ప చదువుల చదివిస్తానంటూ సంతోషంగా చెబుతోంది సత్యవతి అనే మహిళ.

అరవైలో.. ఆరోగ్యమే… మహాభాగ్యం.. అంటూ క్రీడల్లో పతకాలు సాదిస్తున్న సుబ్బాయమ్మ

జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వాళ్లకు వయసు అడ్డంకి కాదు. ఈ సిద్ధాంతాన్ని నమ్మినవాళ్లు.. ఆరు పదులు దాటిన వయసులోనూ ‘సెంచరీలు కొట్టే వయస్సు మాది… అంటూ దూసుకెళ్తుంటారు. అభిరుచులు, అలవాట్లకు అనుగుణంగా ఇష్టమైన రంగాల్లో రాణిస్తుంటారు. ఆదర్శంగా నిలుస్తుంటారు. ఈ కోవకు చెందిన వారిలో గుంటూరులో నివాసం ఉంటున్న 67 ఏళ్ల పెంట్యాల సుబ్బాయమ్మ మొదటి వరుసలో ఉంటారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో షార్ట్ ఫుట్, డిస్కత్రో, జావెలిన్, స్విమ్మింగ్, పరుగు పోటీల్లో సత్తా చాటుతూ వెటరన్ అథ్లెట్ గా గుర్తింపు తెచ్చుకున్నారామె. అరవైలో.. ఆరోగ్యమే… మహాభాగ్యం…

ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన సుబ్బాయమ్మకు అదే జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులకు చెందిన పెంట్యాల జైహింద్ గురూజీతో వివాహమైంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన సుబ్బాయమ్మ భర్త వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారాలు కూడా నిర్వహించేవారు. పిల్లలు ప్రయోజకులై, పెళ్లిళ్లు చేసుకుని ఉద్యోగాల్లో ఉండటంతో 2006లో ద్రోణాదుల నుంచి సుబ్బాయమ్మ, జైహిందు గుంటూరు వచ్చి స్థిరపడ్డారు.

స్వగ్రామంలో యోగా శిక్షణ ఇస్తుండే సుబ్బాయమ్మ.. గుంటూరుకు వచ్చాక రోజూ ఎన్టీఆర్ స్టేడియానికి వెళ్లేవారు. 2008లో లాఫింగ్ క్లబ్ లో చేరారు. క్లబ్ నిర్వాహకులు ఆమె ఉత్సాహం గమనించి క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించారు. దీంతో ఈమె వెటరన్ అథ్లెట్ గా రూపాంతరం చెందారు. షార్ట్ ఫుట్, డిస్కత్రో, జావెలిన్, స్విమ్మింగ్, పరుగు విభాగాల్లో సుబ్బాయమ్మ మైదానంలో దిగారంటే పతకం సాధించకుండా వెనుతిరగరు అనే పేరుంది. సుబ్బాయమ్మను క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించడంతో పాటు తాను కూడా వెటరన్ అథ్లెటిగా రాణిస్తున్నారు. ఆమె భర్త 77 ఏళ్ల జైహింద్. నడక, పరుగు విభాగాల్లో భార్యతోపాటు వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. .

నిత్య సాధన
సుబ్బాయమ్మ రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి గంటన్నర పాటు యోగా, వ్యాయామం చేసి రన్నింగ్, వాకింగ్ ప్రాక్టీస్ చేస్తారు. మొలకెత్తిన గింజలు, పండ్లు, డ్రైఫ్రూట్స్, చిరుధాన్యాలు ఆహారంగా తీసుకుంటారు. మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఎక్కువ ఉప్పు, నూనెలు ఆమె తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండవు. ఆరోగ్యం కోసం దంపతులిద్దరూ నేటికీ ప్రతిరోజు 3 గంటల పాటు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకవైపు క్రీడల్లో రాణిస్తూనే ఇద్దరూ సేంద్రియ వంటకాలను గుంటూరు నగరవాసులకు పరిచయం చేస్తున్నారు.
సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నాలుగు ఎకరాల సొంత పొలంలో కొంత కౌలుకు ఇచ్చి కొంత భాగంలో తేనెటీగలు పెంచుతూ స్వచ్ఛమైన తేనెను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్న ఈ దంపతులు
తమ కాళ్ల మీద తాము నిలబడే ప్రయత్నం చేయడమే కాదు అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేయడం అభినందనీయం.

విజేత సుబ్బాయమ్మ
2012 : బెంగుళూరు-జాతీయ స్థాయి 100, 200 మీటర్ల పరుగు పందెం పోటీల్లో ప్రథమ స్థానం.
2013 : బాపట్ల-రాష్ట్ర స్థాయి పోటీల్లో 100, 200 మీటర్ల పరుగు పందెం పోటీల్లో ప్రథమ స్థానం.
2014 : నెల్లూరు లో 100, 200, 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం.
2015 : గుంటూరు-35 వ మాస్టర్స్ వెటరన్ అథ్లెటిక్స్ లో డిస్కస్ త్రో, 400 మీటర్ల పరుగుపందెంలో మొదటి స్థానం, జావెలిన్ త్రో, 100 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానం.
2016 : మధ్యప్రదేశ్ -జాతీయ స్థాయి పోటీల్లో డిస్కస్ త్రో, జావెలిన్, 100 మీటర్ల పరుగులో బంగారు పతకం.
2017 : బెంగళూరు- జాతీయ స్థాయి పరుగు పందెం పోటీలో బంగారు పతకం.
2018 : హైదరాబాద్- జాతీయ స్థాయి ఈత పోటీల్లో సుబ్బాయమ్మ మూడు విభాగాల్లో పతకాలు.
2020: కేరళ-జాతీయ స్థాయి పోటీల్లో డిస్కస్ త్రో, జావెలిన్లో ప్రథమ బహుమతి.
ఆరోగ్యవంతమైన సమాజం కోసం మా క్రీడాస్ఫూర్తిని సమాజంలో నలుగురికి పంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయడం మా లక్ష్యం. రాష్ట్రం సహా, దేశ వ్యాప్తంగా ఎక్కడ క్రీడల పోటీలున్నా నేను, నా భర్త వెళ్లి పాల్గొంటాం. ఉత్సాహం ఉన్న మా వయసు వారిని మాతో కలుపుకుని, ప్రాక్టీస్ చేయడంతో పాటు, వారిని కూడా పోటీలకు తీసుకువెళుతుంటాం. ఎవరమైనా మితాహారం, నిత్యం వ్యాయామం చేయడం వల్లే ఆరోగ్యంగా ఉంటాం.

పండ్లు, జ్యూస్ లతో పొందండి సంపూర్ణ ఆరోగ్యం

వేసవిలో వచ్చే పండ్లు అంటే ముందుగా గుర్తుకు వచ్చేవి పుచ్చకాయ, తర్భూజ. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయి.
ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయలో ఎర్రగా ఉండే లైకోఫిన్ అనే గుజ్జు వేసవిలో చర్మంలోని సహజ కణజాలం దెబ్బతినకుండా రక్షిస్తుంది
ద్రాక్ష తింటే దాహం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది రక్తశుద్ధి చేయడంలో ఎంతో చక్కగా పనిచేస్తుంది. ద్రాక్ష జ్యూస్ కూడా ఎంతో మంచిది.
పైనాపిల్ నీటి శాతంతో పాటు పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో జీర్ణశక్తిని వృద్ది చేస్తుంది. వీటిలోని విటమిన్ల కలయిక శరీర ఉష్ణోగ్రతలు పెరగకుండా చేస్తాయి. రుచిగా కూడా ఉంటుంది.
నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. శరీరంలోని వేడి తగ్గించేందుకు నిమ్మరసంలో ఉప్పు, చక్కెర కలిపి తీసుకుంటే దాహం తీరడంతో పాటు శక్తి లభిస్తుంది.

ప్రకృతి అందించిన ఫలాల్లో రారాజు మామిడి. వేసవి ప్రారం భంలోనే మామిడి కాయలు వస్తాయి. మామిడి ఫలాలలో ఐరన్, ప్రొటీన్స్, ఎ,సి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. కేన్సర్ను నివారించే బీటా కెరోటిన్ కూడా మామిడిలో ఎక్కువ.

కమలాఫలంలో పొటాషియంతో పాటు పోషకాలు మెండు ఎండాకాలం అంటేనే రోజు రోజుకు పెరిగే ఉష్ణోగ్రతలు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ భయపడేలా చేస్తాయి. ఈ కాలంలో ఎక్కువగా పండ్లు తీసుకుంటే కొంత ఉపశమనం పొందవచ్చని
నిపుణులు చెపుతుంటారు.

శరంలో తగ్గే గ్లూకోజ్ శాతాన్ని పెంచేందుకు పండ్లు ఉపకరిస్తాయని వైద్యులు చెపుతారు.
తప్పనిసరిగా పండ్లు తింటే వేసవి తాపాన్ని, తట్టుకోవచ్చని కూడా చెపుతారు. అందుకే క్రమం తప్పకుండా పండ్లు తింటే మంచిది.

రోజూ సుమారు ఆరు లీటర్ల మంచినీరు తాగాలి. ఇలా చేస్తే ఎలాంటి వ్యాధులురావు. వేసవిలో ప్రతి ఒక్కరు తప్పని సరిగా జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు

వేసవి కాలంలో లభించే కర్భూజాలో శరీరానికి అవసరమైన నీటితో పాటు పోషకాలు లభిస్తాయి పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. వేసవిలో వచ్చే పుచ్చకాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఈ పండ్లలో కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇక కొబ్బరిబొండంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి ఈ కాలంలో డీ హైడ్రేషన్ సుంచి కాపాడుకునేందుకు కొబ్బరి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. తక్కువ మోతాదులో కార్బొహైడ్రేట్లు కూడా లభిస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయి. రోగనిరోధకశక్తి పెంచుతుంది. డీ హైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తలకు రక్షణతో పాటు కళ్లజోడు పెట్టుకోవాలి. గొడుగులు కూడా తప్పనిసరిగా ఉయోగించాలి. అల్ట్రావైలెట్ కిరణాలు శరీరంపై పడినప్పుడు సన్ బర్న్, స్కిన్ ఇన్ ఫెక్షన్ రాకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి ఎండలో తిరుగుతున్నప్పుడు కళ్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
విశ్రాంతి కోసం రోజ్ వాటర్ వేయడం, కళ్లపై కీర దోసకాయ ముక్కలు పెట్టుకోవాలి. వేసవికి కాటన్ దుస్తులు ధరించడం మేలు.
ఎండలో నుండి ఇంటికి రాగానే పండ్ల రసాలు తీసుకోవడం వల్ల కొంతవరకు ఎండ నుంచి వచ్చే వేడి, వడదెబ్బను నివారించవచ్చు.

పైనాపిల్, ద్రాక్ష, రసాలతో పాటు క్యారెట్ జ్యూస్ కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఎండలో తిరిగి అనారోగ్యానికి గురయితే శరీరంపై ఐస్ ముక్కలు లేదా తడిగుడ్డ ఉంచడం పల్ల ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చు. గ్లూకోస్, ఎలక్ట్రాల్ పౌడర్, కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. అలాగే చల్లని గాలి తగిలేలా పడుకోవాలి.