Home Blog Page 189

మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.

రక్తంలో తక్కువ హిమోగ్లోబిన్ స్థాయి మనిషిని బలహీనంగా మారుస్తుంది.అలాగే ఐరన్(ఇనుము) లోపానికి కూడా దారితీస్తుంది. ఐరన్ లోపం అనేది తీవ్రతరం అయితే అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఐరన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. ఈ సమస్య కారణంగా ఎర్ర రక్త కణాల సంఖ్య- లేదా వాటి ఆక్సిజన్ మోసే సామర్థ్యం శారీరక అవసరాలను తీర్చడానికి సరిపోదు.
యునిసెఫ్ నివేదిక ప్రకారం భారత్ లో 15-19 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలలో 56 శాతం బాలురులో 30 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు శరీరంలో ఇనుము స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని సాధారణ గృహ నివారణలను కూడా సూచించారు. అవేంటంటే


మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.

నల్ల నువ్వులు :
వీటిలో ఇనుము, రాగి, జింక్, సెలీనియం విటమిన్- బి6, ఇ తో పాటు ఫోలేట్లు పుష్కలంగా లభిస్తాయి.
ఎలా తినాలి :
సుమారు 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు, డ్రై రోస్ట్ లను ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ నెయ్యితో కలపండి. ఈ మిశ్రమాన్ని ముద్దలుగా చేసుకుని తినండి. ఇనుము లోపం ఎక్కువగా ఉన్నవారు ఈ లడ్డూలను తప్పకుండా తీసుకోండి.

కర్జురా, ఎండుద్రాక్ష :
ఈ పొడి పండ్ల కలయిక ఇనుము, మెగ్నీషియం రాగి, విటమిన్లు- ఎ మరియు సి లను కలిగి ఉంటాయి.
ఎలా తినాలి :
2-3 కర్జూరాలు, ఒక టేబుల్ స్పూన్ ఎండుద్రాక్షను ఉదయాన్నే అల్పాహారంగా, లేదా సాయంత్రం పూట స్నాక్ లాగా తిన్నారంటే మీరు తక్షణ శక్తిని పొందటమే కాక, ఐరన్ స్థాయిలను కూడా పెంచుకోవచ్చు.

బీట్‌రూట్లు, క్యారెట్లు :
తాజా బీట్ రూట్, కారెట్లు కలిపి చేసిన జ్యూస్ తాగడం వల్ల ఇనుము శోషణ పెరుగుతుంది. నిమ్మరసం దీనికి విటమిన్- సి కంటెంట్ను జోడిస్తుంది.
ఎలా తినాలి :
ఒక కప్పు తరిగిన బీట్ రూట్, కప్పు తరిగిన క్యారెట్లు వేసి మిక్సీ పట్టండి. ఈ రసాన్ని వడకట్టి దీంట్లో ఒక టీస్పూన్ నిమ్మరసం కలపండి. ప్రతిరోజూ ఉదయం ఈ రసాన్ని క్రమం తప్పకుండా తాగాలి.


వీట్ గ్రాస్ :
ఇది బిటా కెరోటిన్, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్ కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ విటమిన్ సి అనేక బి విటమిన్ల అద్భుతమైన మూలాన్ని అందిస్తుంది. అంతేకాదు అనేక రకాల రక్త నిర్మాణ కారకాలను కలిగి ఉంటుంది.
ఎలా తినాలి :
ప్రతిరోజూ ఉదయం ఒక టీస్పూన్ వీట్ గ్రాస్ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడటమే కాక, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


మోరింగా ఆకులు :
మోరింగా విత్తనాలు ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఇనుము విటమిన్లు ఎ, సిలతో పాటు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
ఎలా తినాలి :
ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఉదయం 1 స్పూన్ మోరింగా ఆకు పొడి తింటే శరీరంలో ఐరన్ లెవెల్ పెరుగుతాయి.

శరీరం విపరీతంగా లావెక్కుతోందా ! ఇవి పాటించండి

నేడు స్త్రీలకి పనులు తక్కువై శరీరం విపరీతంగా లావెక్కుతోంది. ముఖ్యంగా 20 ఏళ్ల యువకులు, వధువల కోసం వెతికే పెళ్లికాని ప్రసాదులకు పాపం లావిష్టిగా ఉన్న అమ్మాయిలే ఎక్కువగా తగలటంతో పెళ్లి కాకుండా ఉండిపోతున్నారని ఒక సర్వేలో తేలింది.

ఆడపిల్లల చేత ఇంటిపనులు చేయించటం ముఖ్యం. హై.బి.పి షుగర్ హార్ట్ ఎటాక్ రాకుండా వాకింగ్ కూడా చేస్తుండాలి. గుడికెళ్లటంతో భక్తిముక్తి కూడా లభిస్తుంది. ఇంట్లో చీపురు పట్టి ఊడ్చి ముగ్గువేసే ఆడపిల్ల నేడు కనపడటం లేదు పనిమనిషి ఉందనే నిర్లక్ష్యం ఎక్కువైంది. శారీరక శ్రమంటే బరువులు మోయక్కర్లేదు, మెట్లు ఎక్కి దిగండి. బట్టలు జాడిం చండీ వాషింగ్ మిషన్ ఉంది అనుకుంటే, మీ అపార్ట్మెంట్ పై నించి కిందకి కనీసం 3 ఫ్లోర్స్ ఎక్కి దిగండి చాలు పదిసార్లు అలసిపోయే దాకా.

వంటిల్లే వ్యాయామశాల భుజాల నొప్పికి, మిక్సీ వాడకుండా చక్కగా బండరోలు వాడండి. మణికట్టు, చేతి వ్రేళ్లకు మంచి వ్యాయామం. పిండి తడిపి బాగా మెత్తగా పిసకటం, వత్తటం కాల్చటం వల్ల చేతులకి వ్యాయామం అవుతుంది. అంట్లు తోమటం, బాత్రూం టైల్స్ శుభ్రం చేయటం, టబ్స్ పాచిని వదలగొట్టడం గార్డేనింగ్, మొక్కల కొమ్మలు కత్తిరించటం, నీరుపోయటం వల్ల చేతి కండరాలు గట్టిపడతాయి. స్వయంగా షాపుకి వెళ్లి షాపింగ్ చేయటం వల్ల మానసికంగా రిలాక్స్ అవుతారు.

నా పని నేను చేయాలి అనే గాంధీజీ మాటల్లో ఎంతో సత్యం, ఆరోగ్యం ఇమిడి ఉన్నాయి. పనిమనిషిని మానిపించి, ఆడ మగ, పిల్ల పెద్ద ఎవరైనా సరే వారి కప్పు, గ్లాసు, కంచం తోమి కడగడం ఎవరి బట్టలు వారు ఉతికి ఆరేయడం మొదలుపెడితే రోగాలు మటు మాయం అవుతాయి సుమా! అలాగే చిన్నా చితకా ఆరోగ్యంగా ఉండాలంటే కుర్చీకి రెస్టు ఇవ్వాలి. మమ్మల్ని నేలమీద కూలబడమంటారా అని కాదు. అలా కుర్చీకి అతుక్కుపోతే, లాంగ్ సిట్టర్ అయితే హార్టు, షుగర్ పేషెంట్స్ అవటం ఖాయం. డెస్క్ జాబ్ చేసే వారి సిట్టింగ్ అవర్స్ చూడండి. నిద్రకి ఎనిమిది గంటలు వదిలేస్తే మిగతా 90శాతం అలా కూచుని టి.వి.తో, ఆఫీసు పనితో గడిపేస్తారు ఇలా కూచోటంతో మెటబాలిక్, కార్డియో వాస్క్యులర్ సిస్టంకి నష్టం కలుగుతుంది.

దీనితో హైపర్ టెన్షన్, కార్డియో వాస్కులర్ డిసీజ్, ఒబెసిటీ, టైప్-2 షుగర్, కేన్సర్ వచ్చే ఛాన్సు ఎక్కువ. అమెరికన్ పరిశోధన ప్రకారం అలా కుర్చీకి అతుక్కుపోవటం త్వరగా చావుని కొనితెచ్చుకోవటమే.

పైగా హిప్, స్పైన్, షోల్డర్, నెక్ పెయిన్ కి బాధ్యులం మనమే అవుతాం. కండరాలు ఒకే పొజిషన్ కి అలవాటు పడి పూర్ బాడీ బాలెన్స్, కధలకపోవటం జరిగే ప్రమాదం ఉంది. కి- బోర్డుపై వంగి టైపింగ్ చేస్తే అలా వంగి నడవటమే అలవాటు అవుతుంది. కాళ్లను క్రాస్ చేసి కూచుంటే హిప్, లోయర్ బాడీ ప్రభావితం అవుతుంది.

మరి లాంగ్ సిట్టింగ్ కి ఎలా బ్రేక్ ఇవ్వాలి?

మొబైల్లో ప్రతి గంటకీ ఐదునిమిషాలు బ్రేక్ ఇవ్వాలి అనేలా అలారం సెట్ చేయాలి టి.వి ముందు అలా కూలబడకుండా కాసేపు అటు ఇటు నడుస్తూ కళ్లకు కూడా విశ్రాంతి ఇవ్వాలి. ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు పచ్చికూరగాయలను ఆహారంగా తీసుకోండి. ఇవి ఆకలిమితంగా ఉండటానికి జ్ఞాపకశక్తికి చక్కని శరీరాకృతికి మంచి ఛాయ రావడానికి తోడ్పడు తుంది. మధ్యాహ్న భోజనంలో అన్నం ఆకుకూరలు,పప్పు మజ్జిగ తీసుకోవాలి. భోజనానికి ముందుగా ఒక గ్లాసు నీరు త్రాగాలి. ఒక టమాట లేదా ఓ దోసకాయ మిరియాలపొడి చల్లుకు తినాలి. కాఫీ టీలు చాలా వరకు తగ్గించాలి. ఒకటి లేదా రెండు సార్లు తాగితే పరవాలేదు నిమ్మరసం వారానికి ఒకసారి తాగితే ఎంతో మంచిది. అంతే కాకుండా వర్క్ చేసేటపుడు అలాగే కుర్చీలో కాకుండా కొంచెం సేపు ఎక్సర్ సైజ్ బాల్ పై కూచుంటే మజిల్స్ యాక్టివ్ గా ఉంటాయి.

2021లో వాట్సాప్ లో రానున్న కొత్త ఫీచర్లివే!

పాపులర్ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో 2021లో కొత్తగా ఆరు ఆసక్తికరమైన ఫీచర్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొత్త ఫీచర్లు వాట్సాప్ ను మరింత ఆకర్షణీయంగా మార్చనున్నాయి. ఆ కొత్త ఫీచర్లు …


వాట్సాప్ లో చాలా రోజులుగా యూజర్లు ఎదురుచూస్తున్న ఫీచర్ ఇది. వాట్సాప్ వెబ్ నుంచి కూడా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం ఈ ఫీచర్ అందిస్తుంది. ఇప్పటికే కొంత మంది యూజర్లు ఈ ఆడియో, వీడియో కాల్ బటన్స్ అందుకున్నట్లు కూడా వాబీటా ఇన్ఫో గత డిసెంబర్ లో వెల్లడించింది. త్వరలోనే అందరు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


ఒకటి కన్నా ఎక్కువ డివైస్లలో :

ఇప్పటి వరకూ వాట్సాప్ ను ఒకే ఫోన్లో వాడే అవకాశం ఉంది ఒక ఫోన్లో వాడుతున్న అకౌంట్ ను మరో ఫోన్లో వాడాలంటే ముందు ఇందులో నుంచి లాగౌట్ కావాల్సిందే అయితే ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ డివైస్లలో పని చేసే ఫీచర్ పై వాట్సాప్ దృష్టి సారించింది. దీనివల్ల ఒకే అకౌంట్ లో ఒకటి కన్నా ఎక్కువ డివైస్లలో లాగిన్ అయ్యే అవకాశం యూజర్లకు ఉంటుంది.


వీడియోలు పంపే ముందు మ్యూట్ :
యూజర్లు ఓ వీడియోను తమ కాంటాక్ట్లకు పంపే ముందు దానిని మ్యూట్ చేసే అవకాశం కల్పించాలని వాట్సాప్ భావిస్తోంది. ఈ ఫీచర్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఇందులో భాగంగా వీడియోలో ఎడమవైపు ఒక స్పీకర్ ఐకాన్ ఉంటుంది. యూజర్లు దానిని పంపే సమయంలో ఈ ఐకాన్ పై నొక్కితే సరిపోతుంది.


రీడ్ లేటర్ ఫీచర్ :
ఇది కూడా ఒక ఆసక్తికరమైన ఫీచరే.. ఒక చాట్ను మ్యూట్ చేసే అవకాశం దీని ద్వారా కలుగుతుంది. ఒకసారి మ్యూట్ చేస్తే ఆ చాట్ నుంచి తర్వాత వచ్చే మెసేజ్ లు సందింధించి వాట్సాప్ నోటిఫికేషన్లు పంపించదు. ఆర్కైవ్డ్ చాట్ ఫీచర్ కు ఇది మరింత మెరుగైన వెర్షన్. ఆర్కైవ్డ్ చాట్సకు సంబంధించి వాట్సాప్ ఇప్పటికీ నోటిఫికేషన్లు పంపిస్తుంది. కానీ రీడ్ లేటర్లో మ్యూట్ చేస్తే ఆ చాట్ నోటిఫికేషన్లు మళ్లీ రావు. మిస్ అయిన గ్రూప్ కాల్స్ లో ఎప్పుడైనా చేరొచ్చు ఒక గ్రూప్ నుంచి వచ్చిన వీడియో కాల్ ను మీరు మిస్ అయినా తర్వాత మధ్యలోనూ మీరు అందులో చేరే అవకాశం ఈ కొత్త ఫీచర్ కల్పిస్తుంది.

వాట్సాప్ లో ఇన్సురెన్స్ :
ఇప్పటికే వాట్సాప్ పే ఫీచర్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలుసు కదా. ఇక ఇప్పుడు తన ప్లాట్ ఫామ్ పై హెల్త్ ఇన్సూరెన్స్ మైక్రో పెన్షన్ ప్రోడక్ట్ లను కూడా తీసుకువచ్చే ఆలోచలో వాట్సాప్ ఉంది. లైసెన్స్ ఉన్న సంస్థలతో జతకట్టి ఈ ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తేనుంది. ఇప్పటికీ ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ హెచ్డీఎఫ్సీ పెన్షన్లతో వాట్సాప్ చేతులు కలిపింది.

చుండ్రు తగ్గట్లేదా ? ఇలా చేసి చూడండి.

ముఖానికి అందం తెచ్చే వాటిలో కీలకమైనది. మగవారి కంటే లేడీస్ కి జుట్టు ఎక్కువగా ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఎంత ఎక్కువ జుట్టు ఉంటే అంత ఎక్కువ ఆనందం ఉంటుంది. అందువల్ల జుట్టును కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

ఈ భూమిపై మనిషి పుట్టినప్పటి  నుండి  ఉన్న సమస్యల్లో ఒకటి చుండ్రు, తలలో జుట్టు నుంచీ పొడి లాంటిది రాలుతూ ఉంటుంది అది అప్పుడప్పుడూ దురద కూడా తెప్పిస్తుంది. దాన్ని లైట్ తీసుకుంటే డేంజరే ..

ఇంతకీ ఆ చుండ్రు ఎందుకొస్తుందంటే తలలో పేలు ఉండటం వల్లే. ఒక్క పేను  ఉన్నా చాలు అది జుట్టును సర్వనాశనం చేస్తుంది. ఎప్పుడో రాలిపోయే జుట్టును .. ఇప్పుడే రాలిపోయేలా చేస్తుంది. బట్టతల ఇతర సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు. మన జుట్టులోంచీ ఇతరుల జుట్బులోకి కూడా పేనులు ఈజీగా వెళ్లగలవు వాటికి చెక్ పెట్టేందుకు మనం ఆయుర్వేదాన్ని ఫాలో అవ్వాచ్చు. ఎలాగో తెలుసుకుంది.

కర్పూరం:

తలలో పేలను తరిమి తరిమి కొట్టేందుకు అద్భుతమైన ప్రయోగం కర్పూరం వాడకం. ఏం చెయ్యాలంటే మీరు వాడే షాంపూలో కాస్త కర్పూరం కూడా కలపండి. అలాగే మీరు వాడే కొబ్బరి నూనెలో కూడా కర్పూరు కలిపి తలకు రాసుకోండి ఏదో కొత్త పదార్ధం దొరికింది అనుకొని పేలు కర్పూరాన్ని తింటాయి. అప్పుడవి చచ్చిపోతాయి. ఎందుకంటే క్రిములనూ సూక్ష్మజీవులని  సర్వనాశనం చేయగలిగే శక్తి కర్పూరానికి ఉంది.

వేప :

ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదం లో  తప్పని సరి ప్రోడక్ట్ ఏదైనా ఉందా అంటే అది వేప అని చెప్పుకోవచ్చు. వేపలో  సూక్ష్మజీవులని చంపేసే యాంటి ఇన్ఫోమెటరి గుణాలు బోలెడన్ని ఉన్నాయి. వేప నునూ లేదా వేప పేస్ట్ ఏదైనా సేకరించండి. లేదా వేపాకుల్ని గుజ్జులా చేసి పిండితే రసం వస్తుందిగా దాన్ని సేకరించుకోండి. దాన్ని తలకి బాగా పట్టించండి ఓ పావు గంట అలా జుట్టును ఆరనివ్వండి. ఆ తరువాత చుండ్రుతో పాటు పేలూ పోతాయి.

ఈ భూమిపై మనిషి పుట్టినప్పటి  నుండి  ఉన్న సమస్యల్లో ఒకటి చుండ్రు, తలలో జుట్టు నుంచీ పొడి లాంటిది రాలుతూ ఉంటుంది అది అప్పుడప్పుడూ దురద కూడా తెప్పిస్తుంది. దాన్ని లైట్ తీసుకుంటే డేంజరే ..

ఇంతకీ ఆ చుండ్రు ఎందుకొస్తుందంటే తలలో పేలు ఉండటం వల్లే. ఒక్క పేను  ఉన్నా చాలు అది జుట్టును సర్వనాశనం చేస్తుంది. ఎప్పుడో రాలిపోయే జుట్టును .. ఇప్పుడే రాలిపోయేలా చేస్తుంది. బట్టతల ఇతర సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు. మన జుట్టులోంచీ ఇతరుల జుట్బులోకి కూడా పేనులు ఈజీగా వెళ్లగలవు వాటికి చెక్ పెట్టేందుకు మనం ఆయుర్వేదాన్ని ఫాలో అవ్వాచ్చు. ఎలాగో తెలుసుకుంది.

కర్పూరం:

తలలో పేలను తరిమి తరిమి కొట్టేందుకు అద్భుతమైన ప్రయోగం కర్పూరం వాడకం. ఏం చెయ్యాలంటే మీరు వాడే షాంపూలో కాస్త కర్పూరం కూడా కలపండి. అలాగే మీరు వాడే కొబ్బరి నూనెలో కూడా కర్పూరు కలిపి తలకు రాసుకోండి ఏదో కొత్త పదార్ధం దొరికింది అనుకొని పేలు కర్పూరాన్ని తింటాయి. అప్పుడవి చచ్చిపోతాయి. ఎందుకంటే క్రిములనూ సూక్ష్మజీవులని  సర్వనాశనం చేయగలిగే శక్తి కర్పూరానికి ఉంది.

వేప :

ప్రాచీన కాలం నుంచి ఆయుత్వేదం లో  తప్పని సరి ప్రోడక్ట్ ఏదైనా ఉందా అంటే అది వేప అని చెప్పుకోవచ్చు. వేపలో  సూక్ష్మజీవులని చంపేసే యాంటి ఇన్ఫోమెటరి గుణాలు బోలెడన్ని ఉన్నాయి. వేప నునూ లేదా వేప పేస్ట్ ఏదైనా సేకరించండి. లేదా వేపాకుల్ని గుజ్జులా చేసి పిండితే రసం వస్తుందిగా దాన్ని సేకరించుకోండి. దాన్ని తలకి బాగా పట్టించండి ఓ పావు గంట అలా జుట్టును ఆరనివ్వండి. ఆ తరువాత చుండ్రుతో పాటు పేలూ పోతాయి.

కస్టమర్ ల అభిరుచులను కనిపెట్టి వారిని ఎలా కాపాడుకోవాలో మీకు తెలుసా ?

లాభాలు పెంచుకోవాలి, ఖర్చు లు తగ్గించుకోవాలి, పోటీలో ముందు ఉండాలి. కస్టమర్ల అభిరుచులను కవిపెట్డి వారిని కలకాలం కాపాడుకోవాలి..ఎలా ? వినియోగదారుల అవసరాల మేరకు వస్తువులు మార్కెట్లో ఏ విధంగా వస్తాయి ట్రెండ్స్ అందరూ ఫాలో అవుతారు.మరి ఆ ట్రెండ్స్ ఎవరు సృష్టిస్తారు? ఆధునిక డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలో ఎదురయ్యే ఈ ప్రశ్నలకు ఏకైక సమాధానం ఎనలిటిక్స్. మనం నిన్న అన్వేషించిన వస్తువుకు సంబంధించిన సమాచారం ఈ రోజు ఏ వెబ్ సైట్ చూస్తున్నా, వాణిజ్య ప్రకటన రూపంలో దర్శనమిస్తుంది

బెంగళూరు వెళ్లడానికి అన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత పక్కనే బెంగళూరు హోటళ్ళు  ట్రావెల్ ఏజెన్సీల ప్రకటనలు వస్తుంటాయి. ఇవన్నీ ఎలాసాధ్యం? మన అవసరాలు, ఇష్టాలను అంత వేగంగా ఎవరు గమనిస్తున్నారు.. మనకు కావాల్సిన వాటినే ఎలా ప్రదర్శిస్తున్నారు ఒకటే సమాధాను. అదంతా ఎనలిటిక్స్ మహిమ

ఇదే  ఇప్పటి ఆధునిక వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తోంది. కొత్త కొత్త అవకాశాలకు దారి చూపుతోంది. ఆ పెద్ద ఎత్తున  సమాచారాన్ని సేకరింది, విశ్లేషించి వ్యాపార, వాణిజ్యా వ్యూహాలకు దిశానిర్దేశం చేస్తోంది. ఫైనాన్షియల్ సర్వీస్, రిటైల్, హెల్త్ కేర్, ఎఫ్ ఎం సి జి . మీడియా తదితర విభాగాల్లో ఎనలిటిక్స ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్టాట్స్  క్వాన్ టిటేటివ్ – ఎనాలిసిస్  ఫాక్ట్ బెస్ట్  మేనజమేంట్  తదితరాలలో విశ్లేషించి, కొన్ని రకాల ఫలితాలను పొందమే  ప్రధాన లక్ష్యం. వీటి ఆధారంగా వినయోగదారుల బి హేవియర్, ప్యాటర్న్, ట్రెండ్  పపసిగాడతారు. వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు. వ్యూహాలను రచిస్తారు.