Home Blog Page 190

ఎవరెస్ట్ ఎత్తును ఎవరెవరు కొలిచారో మీకు తెలుసా ?

1856లో తొలిసారి సర్వే ఆఫ్ ఇండియా ఎవరెస్ట్ శిఖరాన్ని కొలిచింది. సర్ జార్జ్ ఎవరెస్ట్ నేతృత్వంలో ఆ సర్వే సాగింది. ఎవరెస్ట్ ఎత్తు 29వేల ఫీట్లు ఉన్నట్లు నిర్ధారించారు. రౌండ్ ఫిగర్ కాకుండా మరో రెండు ఫీట్లు పెంచి.. దాన్ని 29,002 ఫీట్లుగా మార్చారు. ఇది మీటర్లలో కొలిస్తే.. 8,839.2 మీటర్లు అవుతుంది. 1980-83, 1903 సంవత్సరాల్లో కూడా సర్వే ఆఫ్ ఇండియా మళ్లీ ఎవరెస్ట్ ఎత్తును కొలిచింది. ఆ లెక్కల్లో ఎవరెస్ట్ ఎత్తు 8882 మీటర్లు లేదా 29,141 ఫీట్లుగా నిర్ధారించారు. 1955లో మళ్లీ సర్వే ఆఫ్ ఇండియా ఎవరెస్ట్ ఎత్తును లెక్కించింది. అప్పుడు ఆ పర్వతం ఎత్తు 8848 మీటర్లు లేదా 29028 ఫీట్లుగా గుర్తించారు అయితే 1975లో చైనా ఆ ఎత్తును కన్ఫర్మ్ చేసింది. 1987లో ఇటలీ కూడా ఎవరెస్టు కొలిచింది.

ఎవరెస్ట్ ఎత్తు 8872 మీటర్లు ఉన్నట్లు ఆ దేశం తేల్చింది. మళ్లీ 1992లోనే – ఇటలీ ఎవరెస్ట్ ఎత్తును లెక్కించింది. అప్పుడు రాక్ హయిటు 8846 మీటర్లుగా నిర్ధారించారు. 1999లో అమెరికా కూడా ఎవరెస్ట్ ఎత్తును కొలిచింది. ఎవరెస్ట్ 8850 మీటర్లు లేదా 29035 ఫీట్ల ఎత్తు ఉన్నట్లు ఆ దేశం తేల్చింది. 2005లో చైనా కూడా ఎవరెస్ట్ ఎత్తును కోలిచింది. వారి లెక్కల ప్రకారం ఎవరెస్ట్ ఎత్తు 8844.43 మీటర్లు లేదా 29017 ఫీట్లుగా ఉంది. ఈ ఏడాది నేపాల్, చైనా దేశాలు సంయుక్తంగా ఎవరెస్ట్ పర్వతం ఎత్తును ప్రకటించాయి. వారి లెక్కల ప్రకారం ఎవరెస్ట్ ఎత్తు 86 సెంటీమీటర్లు పెరిగింది. ఇప్పుడు ఎవరెస్ట్ ఎత్తు 8848.86 మీటర్లు. భీమ్ లాల్ గౌతమ్ అనే నేపాలీ సర్వేయర్‌తో పాటు న్యూజిలాండ్ సర్వేయర్లు ఈసారి ఎవరెస్ట్ ఎత్తును కొలిచారు.

2019, మే 22వ తేదీన గౌతమ్ బృందం ఎవరెస్ట్ శిఖరంపైకి చేరుకున్నది. జీఎస్ఎస్ఎస్ ఈక్విప్మెంట్ ద్వారా పర్వతం ఎత్తును కొలిచారు. పర్వతారోహకుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ట్రైపాడ్ ఎత్తును లెక్కించారు. న్యూజిలాండ్ లోని ఒటాగో వర్సిటీకి చెందిన క్రిస్టోఫర్ పియర్నతో కలిసి నేపాలీ సర్వేయర్లు పనిచేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ లోని కే: పర్వతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తు అయిన రెండవ పర్వతం. దాని ఎత్తు 8611 మీటర్లు. అయితే ఎవరెస్ట్ ఎత్తు పెరగడంతో ఆ పర్వతానికి ఎటువంటి ప్రమాదం లేదని సర్వేయర్లు చెబుతున్నారు.

ఏ వయసు వారు ఎలాంటి వ్యాయామాలు చేయాలో మీకు తెలుసా ?(W H O ప్రకారం)

ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాలని అందరికీ తెలుసు. కానీ ఏ వయసు వారు ఎంతసేపు, ఎలాంటి వ్యాయామాలు చేయాలి? అనే అంశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెవో) తాజాగా స్పష్టత ఇచ్చింది. ఐదేళ్ల పిల్లలు మొదలు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, గర్భిణులను ఐదు కేటగిరీలుగా విభజించి ఎవరెంతసేపు ఎక్సర్ సైజులు చేయాలో సూచించింది. బీపీ, షుగర్, ఎసిడిటీ, స్థూలకాయం , కేన్సర్, గుండె జబ్బులు తదితర జీవనశైలి
వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు తిరిగి ఆరోగ్యకర జీవనం సాగించేందుకు వీలుగా శారీరక శ్రమపై తొలిసారి శాస్త్రీయ మార్గదర్శకాలతో నివేదిక విడుదల చేసింది. 5-17 ఏళ్ల వయసువారు…. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ఐదేళ్ల నుంచి 17 ఏళ్లలోపు ఉన్న పిల్లలు, ప్రతిరోజూ కనీసం గంటపాటు శక్తివంతమైన వ్యాయామాలు చేయాలి. ఎక్కువగా పరిగెత్తడం, జాగింగ్ లేదా ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి. వారంలో మూడురోజులు కండరాలు, ఎముకలను బలోపేతం చేసే ఎక్సర్ సైజులు చేయాలి. ఆటలు ఆడాలి.

18-64 ఏళ్ల వయసువారు:-
ప్రతివారం కనీసం రెండున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు (రోజుకు గరిష్టంగా సుమారు 45 నిమిషాలు) తేలికపాటి నుంచి కఠిన ఎక్సర్సైజులు చేయాలి. వారానికి కనీసం 95 నిమిషాల నుంచి రెండున్నర గంటల వరకు కఠినమైన వ్యాయామాలు చేయడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, కేన్సర్, టైప్ 1 మరియు 2 డయాబెటీస్ నుంచి బయటపడొచ్చు. శారీరక ఆరోగ్యం , మానసిక శ్రేయస్సు కోసం వ్యాయామం అవసరం.

65 ఏళ్లు పైబడినవారు:-
వృద్ధులు సైతం 18-64 ఏళ్ల వయసు కేటగిరీ వారు చేసే వ్యాయామాలన్నీ చేయవచ్చు. వాటితోపాటు వారు వారానికి కనీసం మూడు రోజులు శరీర బ్యాలెన్సుకు దోహదపడే ఎక్సర్ సైజులు చేయడం మంచిది. వృద్ధులు తూలి కిందపడకుండా ఉండేందుకు ఈ తరహా వ్యాయామాలు ఉపయోగపడతాయి.

గర్భిణులు:-

గర్భిణులు లేదా బాలింతలు ఎలాంటి సమస్యలు లేకపోతే డాక్టర్ల సూచన మేరకు ప్రతివారం కనీసం రెండున్నర గంటల వరకు పరిమితమైన ఏరోబిక్స్ చేయాలి. అయితే వ్యాయామ సమయంలో నిర్ణీత పరిమాణంలో మంచినీరు తప్పక తాగాలి. కఠినమైన వ్యాయామాలు చేయరాదు.

దీర్ఘకాలిక అనారోగ్యాలున్నవారు:-

దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధులున్న వారు వారానికి కనీసం గంటన్నర నుంచి ఐదు గంటలపాటు ఏరోబిక్స్ చేయాలి. లేదా వారానికి కనీసం 75 నిమిషాల నుంచి రెండున్నర గంటలపాటు కఠినమైన, శక్తివంతమైన ఏరోబిక్స్ చేయాలి. అలాగే వారానికి కొన్నిసార్లు, తమ సామర్థ్యాలను పెంచుకోవడానికి బ్యాలెన్స్ వ్యాయామాలు చేయాలి.

శారీరక శ్రమను ప్రోత్సహించాలి డబ్ల్యూహెవో నివేదికలోని మార్గదర్శకాలు అత్యంత శాస్త్రీయమైనవి. అందువల్ల శారీరక శ్రమ చేసేందుకు పిల్లలను ప్రోత్సహించాలి. తద్వారా వారిలో గుండె, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి మానసిక ఉల్లాసం లభిస్తుంది. శారీరక శ్రమ చేసే గర్భిణుల్లో బీపీ సమస్య తలెత్తదు. ముందస్తు కాన్పుల సమస్య తగ్గుతుంది.

డబ్ల్యూహెవో పేర్కొన్న అంశాలివి:-

1) రోజుకు 10-12 గంటలు స్థిరంగా కూర్చునే వారిలో ముందస్తు మరణాలు సంభవించే అవకాశం మిగతావారికంటే 1.5 రెట్లు ఎక్కువ.

2) శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారిలో కిడ్నీ సమస్యలు, కడుపులో మంట, కేన్సర్ వంటివి 10 నుంచి 20 శాతం వరకు తగ్గుతాయి. అధిక బరువు సమస్య తలెత్తదు. షుగర్ వ్యాధిగ్రస్తులకు గుండెజబ్బు మరణాలు 40 శాతం తగ్గుతాయి.

3) 27.5 శాతం పెద్దలు, 81 శాతం యుక్త వయస్కులు శారీరక శ్రమ చేయడంలేదు.

ప్లాస్టిక్ కప్పులో టీ లేదా కాఫీ తాగితే ఏమవుతుందో మీకు తెలుసా ?

పనిచేసి అలసిపోయినా.. ఆలోచనలతో తలనొప్పి వచ్చినా కప్పు టీ లేదా కాఫీతో ఉపశమనం పొందొచ్చు. అందుకే ఉద్యోగులంతా ఆఫీసులో కాస్త బ్రేక్ దొరికితే తెగ టీ, కాఫీలు తాగేస్తుంటారు. టీ ఆరోగ్యానికి మంచిదే కావచ్చు.. తాగాకా మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపించొచ్చు.. కానీ ఇక్కడ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఓ విషయం ఒకటుంది. అదేంటీ టీ, కాఫీలో ఆరోగ్యాన్ని దెబ్బతీసేది ఏముంటది అనుకుంటున్నారా.! నిజమే ఛాయ్ లో అలాంటిదేమీ లేదు. కానీ.. అవి తాగుతున్న గ్లాసులో ఉండచ్చు కదా.

అవును.. ఈ మధ్య దాదాపు అన్నిచోట్లా టీ, కాఫీలు ప్లాస్టిక్ కప్పుల్లోనే పోసి ఇస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. మామూలు స్టీల్, గాజు గ్లాసులైతే కడిగి వినియోగించుకుంటారు. శుభ్రం చేసేవారు లేకపోవడం.. పలువురు వాడిన వాటిని మళ్లీ వాడటం చాలామందికి అసౌకర్యంగా అనిపించడంతో వీటి వాడకం తగ్గింది.

ఒక్కసారి వాడి పడేసే వీలుండటంతో ప్లాస్టిక్ గ్లాసులకు ఆదరణ పెరిగింది. కానీ ఈ కప్పులోనే మనకు తెలియని విషం ఉంది. ప్లాస్టిక్ మానవాళికి ఎంత హాని చేస్తుందో ఇప్పటికి చాలామంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా వీటి వాడకం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్లాస్టిక్ కప్పుల్లో కాఫీ, టీలు తాగడం వల్ల ఆరోగ్యానికి మరింత హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ కప్పుల్లో లోపల ఓ లైనింగ్ ఉంటుంది. ఈ లైనింగ్ కారణంగా కప్ వాటర్ ప్రూఫ్ లా పనిచేస్తుంది. దీంట్లోని రసాయనాలు పర్యావరణంతోపాటు మనిషి ఆరోగ్యానికి సైతం పలు విధాలా హాని చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్లాస్టిక్ కప్పుల్లో వేడివేడి టీ, కాఫీలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలుసుకునేందుకు ఓ అధ్యయనం చేశారు.

ఇందులో భాగంగా.. 100 మిల్లీ లీటర్ల కప్పులలో వేడి నీరు పోసి 15 నిమిషాలు ఉంచారు. ఆ తరువాత ఈ నీటిని ఓ స్ట్రాంగ్ మైక్రోస్కోప్ కింద పరీక్షించారు. అప్పుడు ఒక్కొక్క కప్ లో సుమారుగా ఇరవై ఐదు వేల మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లుగా కనుగొన్నారు. ఈ నీటిలో హాని కారక లోహాలైన జింక్, లెడ్, క్రోమియం సైతం ఉన్నట్లు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే.. ప్లాస్టిక్ కప్పులో వేడి నీరు/టీ/కాఫీలు పోస్తే అవి విష పదార్థాలుగా మారే అవకాశాలున్నాయి. అంతేకాదు తరచూ ప్లాస్టిక్ కప్పుల్లో టీ, కాఫీలు తాగుతున్న వారు రోజుకు కొన్ని వేల మైక్రో ప్లాస్టిక్స్ ను మింగేస్తున్నట్లేనట. ఇలాంటి వారిలో కొంత కాలం తరువాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకూ వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

2021 లో బ్యాంకు లకు 100 రోజులు సెలవులు …..ఎప్పుడో మీకు తెలుసా ?

ప్రస్తుతం బ్యాంకు ఖాతా లేనివారెవరూ లేరు. రోజు వారీ జీవితంలో బ్యాంకు లావాదేవీలు జరపడం పరిపాటిగా మారింది. అందువల్ల బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయో తప్పనిసరిగా తెలుసుకోవాలి. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు, జాతీయ సెలవులు అన్నీ కలుపుకొని వచ్చే ఏడాది బ్యాంకులకు మొత్తం 100 రోజులు సెలవులు వస్తున్నాయి. అందువల్ల సెలవులకు అనుగుణంగా మన కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి నెలలో ఏ బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉంటాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన అధికారిక వెబ్ సైట్ లో అప్డేట్ చేస్తుంది. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పండుగలు, పర్వదినాలు ఉంటాయి. అందుడల్ల బ్యాంకుల సెలవులను ప్రాంతీయ కార్యాలయాల వారీగా అందులో పొందుపరుస్తుంది. 2021 హైదరాబాద్ రీజియన్ లో బ్యాంకులకు ఎప్పుడు సెలవులు ఉంటాయో ఆర్బీఐ ప్రకటించింది.

ఇందులో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు, పబ్లిక్ హాలిడేస్ కలిపి 2021లో మొత్తం 100 సెలవులు ఉన్నాయి. నెలల వారీగా బ్యాంకుల సెలవులు ఇలా ఉన్నాయి. -జనవరి: జనవరి 14 (గురువారం – మకర సంక్రాంతి, జనవరి 26 (మంగళవారం)- రిపబ్లిక్ డే మార్చి నెలలో : మార్చి 11 (గురువారం)- మహా శివరాత్రి, మార్చి 29 (సోరువారం)- హోలీ.

ఏప్రిల్ నెలలో: ఏప్రిల్ 1 (గురువారం)- అకౌంట్స్ క్లోజింగ్ డే, ఏప్రిల్ 2 (శుక్రవారం)- గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5 (సోమవారం)- బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 18 (మంగళవారం)- ఉగాది, ఏప్రిల్ 14 (బుధవారం)- అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 21 (బుధవారం)- శ్రీ రామ నవమి మే నెలలో: మే 1 (శనివారం)- కార్మికుల దినోత్సవం, మే 14 (శుక్రవారం)- రంజాన్.

జూలై నెలలో: జూలై 11 (ఆదివారం)- బోనాలు, జూలై 21 (బుధవారం)- బక్రీద్ ఆగస్టు నెలలో: ఆగస్టు 19 (గురువారం)- మొహర్రం, ఆగస్టు 31 (సోమవారం)- కృష్ణాష్టమి, సెప్టెంబర్ నెలలో: సెప్టెంబర్ 10 (శుక్రవారం)వినాయక చవితి.

అక్టోబర్ నెలలో: అక్టోబర్ 2 (శనివారం) గాంధీజయంతి, అక్టోబర్ 6 (బుదవారం)-బతుకమ్ము , అక్టోబర్ 13 (బుధవారం)-మహా అష్టమి, అక్టోబర్ 15 (శుక్రవారం) విజయదశమి, అక్టోబర్ 18 (సోమవారం) – మిలాద్ ఉన్ నబీ నవంబర్ నెలలో: నవంబర్ 4 (గురువారం)- దీపావళి, నవంబర్ 19 (శుక్రవారం)- గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి డిసెంబర్ నెలలో: డిసెంబర్ 25 (శనివారం)- క్రిస్మస్
గమనిక: వీటికి తోడు అదివారాలు, రెండో శనివారాలు, నాలుగో శనివారాలు, నేషనల్ హాలీడేస్ ఉంటాయి

Fastag- Electronic toll collection complete details 2021| ఎలక్ట్రానిక్ టోల్ ఫాస్టాగ్ ఎలా కొనాలి పూర్తి వివరాలు

జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ ఫాస్టాగ్ తో హైవేలపై టోల్ ప్లాజాల దగ్గర టైమ్ వృథా అయ్యే అవకాశం ఉండదు. రానున్న రోజుల్లో ఫాస్టాగ్ లేకపోతే హైవే ఎక్కే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఈ ఫాస్టాగ్ ఎక్కడ కొనాలి? ఎలా రీఛార్జ్ చేయాలో ఒకసారి చూద్దాం .


ఫాస్టాగ్ ఎలా కొనాలి?
దీనికోసం చాలా ఆప్షన్లే ఉన్నాయి. మీ కారు కోసం ఫాస్టాగ్ కొనాలంటే నేరుగా టోల్ ప్లాజాల దగ్గరికి వెళ్లవచ్చు. దీనికోసం మీ ఐడీ, వెహికిల్ రిజిస్ట్రేషన్ పత్రాలను కచ్చితంగా తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. కేవైసీ ప్రక్రియ కోసం ఇవి తప్పనిసరి. ఇంకా సులువుగా కొనాలనుకుంటే.. అమెజాన్ వెబ్ సైటు లేదా ఈ ఫాస్టాగ్ అందించే బ్యాంక్ వెబ్ సైట్లకు వెళ్లవచ్చు.

ప్రస్తుతానికి ఫాస్టాగ్ ను హెడీఎఫ్ సీ, ఐసీఐసీఐ, ఎస్ బీ ఐ , కోటక్, యాక్సిస్ బ్యాంకులు అందిస్తున్నాయి. ఇవే కాకుండా మీ ఫోన్ లోని పేటీఎం, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ యాప్స్ ద్వారా కూడా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఫాస్టాగ్ కు ఎంత ఖర్చువుతుంది? ఫాస్టాగ్ కు ఎంత ఖర్చువుతుందన్నది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది మీరు ఏ వాహనం కోసం తీసుకుంటున్నారు అంటే కార్, జీప్, వ్యాన్, బస్, ట్రక్, వాణిజ్య వాహనాలు వంటివి. రెండోది.. ఏ బ్యాంక్ నుంచి ఈ ఫాస్టాగ్ ను తీసుకుంటారన్నదానిపై కూడా ధర ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ మీ కారుకు పేటీఎం నుంచి ఫాస్టాగ్ తీసుకోవాలని అనుకుంటే.. రూ.500 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇందులోనే రీఫండబుల్ సెక్యూరిటీ అమౌంట్ రూ.250, కనీస బ్యా లెన్స్ రూ.150 కూడా ఉంటుంది. ఇక ఇదే ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి అయితే.. ట్యాగ్ జారీ చేయడానికి రూ.99.12, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్, రూ.200 కనీస బ్యాలెన్స్ అవసరమవుతుంది. ఫాస్టాగ్లా పై పలు బ్యాంకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఇస్తున్నాయి.

రీఛార్జ్ ఎలా?
ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా చాలా ఈజీ. — మీరు ఏ బ్యాంక్ నుంచి కొన్నారో..
దాని ఫాస్టాగ్ వాలెట్ లోకి వెళ్లి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్, క్రెడిట్ కార్డ్, లేదా యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా రీఛార్జ్ చేసుకోవాలంటే పేటీఎం, ఫోన్ పై, అమెజాన్ పే, గూగుల్ పేలాంటివి వాడొచ్చు. ఇవి ఏ బ్యాంక్ ఫాస్టాగ్ కైనా రీఛార్జ్ ఆప్షన్ ఇస్తున్నాయి.