మీరు కొత్తగా డ్రైవింగ్ చేస్తున్నారా?
అయితే రోడ్డు ప్రమాదాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పు ఎవరిది అనేది ప్రమాదం నుంచి మనల్ని రక్షించదు. అందుకే వాహనాలు నడిపేటపుడు ఏ చిన్న పొరపాటు జరగకుండా, అశ్రద్దకు చోటివ్వకుండా ఉండటం అత్యవ సరం. అశ్రద్ధ, అజాగ్రత్త, హడావిడి వల్ల జరిగే ప్రమాదాల శాతం ఇప్పుడు ఎక్కువగానే ఉంటోంది.
మరి మీరూ వాహనం నడుపుతు న్నారా? అయితే డ్రైవింగ్ లైసెన్స్, సీబుక్, హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ఇవన్నీ ఉంటే సరిపోదు. అంతకు మించిన జాగ్రత్త ఉండాలి. కొన్ని చిన్న చిన్న విషయాల్లో కూడా పెద్దగానే శ్రద్ధ పెట్టాలి. అప్పుడే మీ ప్రయాణం క్షేమం, హాయి? – ట్రాఫిక్ ఎక్కువైన చోట ఊరికే చికాకుపడుతూ వాహనాన్ని అటూ ఇటూ కదిలిస్తూ ఆ చికాకును కోపం రూపంలో ఎవరొకరిపై చూపించకండి.
ఇతరులపై మండిపడేకంటే అది తప్పదు అని నిర్ణయించుకుని ముందుకుపోవడమే మంచిది. ఎందుకంటే చికాకుపడి, హడావిడి పడి అక్కడ సాధించేదేమి ఉండదు. ఇంకాస్త ఆలస్యం కావడం తప్ప. మీరు నెమ్మదిగా వెళ్లేటపుడు వెనుక ఉన్న వాహనాలకు దారి ఇవ్వడం మంచి పద్దతి. దీనికి చేయవలసిందల్లా మీ వాహనాన్ని పూర్తిగా ఎడమ పక్కకు నడపడమే. – అవసరమైనపుడు తప్పనిసరిగా సిగ్నల్స్‌ను ఉపయోగించండి. అశ్రద్ధచేసి వెనకవచ్చే వారికి ప్రమాదం తెచ్చి పెట్టవద్దు. మీరూ ప్రమాదంలో చిక్కుకోవద్దు. – పక్కనున్నవాళ్లు లేదా మీ పక్కనుంచి వెళ్లే వాహనదారుల మాటలకు అనవసరమైన ఉత్సాహా నికి గురికావద్దు. వాహనం మితి మీరిన వేగంతో నడిపి ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది.
- మీ వాహనం హారన్
అవసరమైతేనే వాడండి. అదికూడా ఇతరులకు ఇబ్బంది కలిగించేలా అదేపనిగా మోగించకుండా మధ్యలో కాస్త విరామం ఇచ్చి చిన్నగా మోగించండి. మీరు వెళ్లే దారులు ఎంత రద్దీగా ఉంటాయో మీకు అవగాహన ఉంటుంది కాబట్టి కాస్త ముందుగా బయలుదేరితే ఎలాంటి ఒత్తిడి, హడావిడి ఉండదు. కాస్త హాయిగా ప్రయాణం చేయవచ్చు. – స్నేహితులతో పిచ్చాపాటి కబుర్లు చెప్పడానికి, సెల్‌ఫోనులో మాట్లాడటానికి రోడ్డు మధ్యలో వాహనాన్ని నిలపకుండా వెంటనే పక్కకు తీసుకోవాలి. ఇది ప్రమాదాలకు దూరంగా ఉంచి, ఇతరులకు ఇబ్బందిలేకుండా చేసే విధానం. – ఎవరో ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదని మీ దృష్టంతా వారిని తిట్టడంపై మళ్ళిస్తే ఈలోగా మీ వాహనం అదుపు తప్పడం ఖాయం.
వాహనం నడుపుతున్నంత సేపు మీ డ్రైవింగ్‌పై పై దృష్టి పెట్టండి. – వాహనాన్ని నడుపుతున్నపుడు ప్రశాంతమైన సంగీతం వినండి. అంతేకాని ఉద్రేకపరచే సంగీతాన్ని వింటే అది మీరు అనుకోకుండా మీ వాహనం వేగాన్ని పెంచేలా చేస్తుంది. ఇది చాలా ప్రమాదక రమైన పద్దతి కూడా. వాహనాన్ని నడుపుతున్నపుడు వీలైనంతమేరకు నిశ్శబ్దంగా ఉండటమే మంచిది.
ట్రాఫిక్ స్తంభించినపుడు, ఎవరిమీదైనా మీకు బాగా కోపం వచ్చినపుడు మీ కోపం అదుపు తప్పకుండా ఉండేందుకు గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ఎందుకంటే కోపంలో వారిని ఏమీ అనకపో యినా అది మీ డ్రైవింగ్‌పై ప్రభావాన్ని చూపుతుంది. అన్నింటికి మించి డ్రైవింగ్ చేసేటపుడు ప్రశాంతమైన మనసుతో ఉంటే ఎలాంటి ప్రమాదాల బారినా పడకుండా ఉండవచ్చు.