“Vinarandi Naa Priyuni Song Lyrics in Telugu || వినరండి నా ప్రియుని విశేషము Song Lyrics” Song Lyrics
వినరండి నా ప్రియుని విశేషము
నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు ||2||
నా ప్రియుని నీడలో చేరితిని
ప్రేమకు రూపము చూసితిని ||2||
ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే
తనువంతా పులకించి మహదానందమే ||వినరండి||
1. మహిమతో నిండిన వీధులలో
బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో ||2||
జతగా చేరెదను ఆ సన్నిధిలో
కురిసె చిరుజల్లై ప్రేమామృతము
నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే
జతగా చేరెదను ఆ సన్నిధిలో
నా ప్రేమను ప్రియునికి తెలిపెదను
కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి||
2. జగతికి రూపము లేనప్పుడు
కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు ||2||
స్తుతినే వస్త్రముగా ధరించుకొని
కృపన్ జయధ్వనితో కీర్తించెదను
నా ప్రభు యేసు చెంతన చేరెదను
స్తుతినే వస్త్రముగా ధరించుకొని
నా ప్రభు యేసు చెంతన చేరెదను
యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి||
3. తలపుల ప్రతి మలుపు గెలుపులతో
నిలిచె శుద్ధ హృదయాల వీరులతో ||2||
ఫలము ప్రతిఫలము నే పొందుకొని
ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
ఫలము ప్రతిఫలము నే పొందుకొని
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
నా ప్రియుని విడువను నేనెన్నడు ||వినరండి||