Home Health ప్లాస్టిక్ కప్పులో టీ లేదా కాఫీ తాగితే ఏమవుతుందో మీకు తెలుసా ?

ప్లాస్టిక్ కప్పులో టీ లేదా కాఫీ తాగితే ఏమవుతుందో మీకు తెలుసా ?

ప్లాస్టిక్ కప్పులో టీ లేదా కాఫీ తాగితే ఏమవుతుందో మీకు తెలుసా ?
Tea on Plastic cups

పనిచేసి అలసిపోయినా.. ఆలోచనలతో తలనొప్పి వచ్చినా కప్పు టీ లేదా కాఫీతో ఉపశమనం పొందొచ్చు. అందుకే ఉద్యోగులంతా ఆఫీసులో కాస్త బ్రేక్ దొరికితే తెగ టీ, కాఫీలు తాగేస్తుంటారు. టీ ఆరోగ్యానికి మంచిదే కావచ్చు.. తాగాకా మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపించొచ్చు.. కానీ ఇక్కడ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఓ విషయం ఒకటుంది. అదేంటీ టీ, కాఫీలో ఆరోగ్యాన్ని దెబ్బతీసేది ఏముంటది అనుకుంటున్నారా.! నిజమే ఛాయ్ లో అలాంటిదేమీ లేదు. కానీ.. అవి తాగుతున్న గ్లాసులో ఉండచ్చు కదా.

అవును.. ఈ మధ్య దాదాపు అన్నిచోట్లా టీ, కాఫీలు ప్లాస్టిక్ కప్పుల్లోనే పోసి ఇస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. మామూలు స్టీల్, గాజు గ్లాసులైతే కడిగి వినియోగించుకుంటారు. శుభ్రం చేసేవారు లేకపోవడం.. పలువురు వాడిన వాటిని మళ్లీ వాడటం చాలామందికి అసౌకర్యంగా అనిపించడంతో వీటి వాడకం తగ్గింది.

ఒక్కసారి వాడి పడేసే వీలుండటంతో ప్లాస్టిక్ గ్లాసులకు ఆదరణ పెరిగింది. కానీ ఈ కప్పులోనే మనకు తెలియని విషం ఉంది. ప్లాస్టిక్ మానవాళికి ఎంత హాని చేస్తుందో ఇప్పటికి చాలామంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా వీటి వాడకం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్లాస్టిక్ కప్పుల్లో కాఫీ, టీలు తాగడం వల్ల ఆరోగ్యానికి మరింత హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ కప్పుల్లో లోపల ఓ లైనింగ్ ఉంటుంది. ఈ లైనింగ్ కారణంగా కప్ వాటర్ ప్రూఫ్ లా పనిచేస్తుంది. దీంట్లోని రసాయనాలు పర్యావరణంతోపాటు మనిషి ఆరోగ్యానికి సైతం పలు విధాలా హాని చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్లాస్టిక్ కప్పుల్లో వేడివేడి టీ, కాఫీలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలుసుకునేందుకు ఓ అధ్యయనం చేశారు.

ఇందులో భాగంగా.. 100 మిల్లీ లీటర్ల కప్పులలో వేడి నీరు పోసి 15 నిమిషాలు ఉంచారు. ఆ తరువాత ఈ నీటిని ఓ స్ట్రాంగ్ మైక్రోస్కోప్ కింద పరీక్షించారు. అప్పుడు ఒక్కొక్క కప్ లో సుమారుగా ఇరవై ఐదు వేల మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లుగా కనుగొన్నారు. ఈ నీటిలో హాని కారక లోహాలైన జింక్, లెడ్, క్రోమియం సైతం ఉన్నట్లు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే.. ప్లాస్టిక్ కప్పులో వేడి నీరు/టీ/కాఫీలు పోస్తే అవి విష పదార్థాలుగా మారే అవకాశాలున్నాయి. అంతేకాదు తరచూ ప్లాస్టిక్ కప్పుల్లో టీ, కాఫీలు తాగుతున్న వారు రోజుకు కొన్ని వేల మైక్రో ప్లాస్టిక్స్ ను మింగేస్తున్నట్లేనట. ఇలాంటి వారిలో కొంత కాలం తరువాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకూ వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here